స్నేహితురాలి వివాహ రిసెప్షన్‌.. డాన్స్‌ చేస్తూ ఇంజినీర్‌ మృతి | Sakshi
Sakshi News home page

స్నేహితురాలి వివాహ రిసెప్షన్‌.. డాన్స్‌ చేస్తూ ఇంజినీర్‌ మృతి

Published Sun, Jun 4 2023 9:50 AM

- - Sakshi

తిరువొత్తియూరు: చైన్నె ముగప్పేర్‌లో తన స్నేహితురాలి వివాహ రిసెప్షన్‌లో డ్యాన్స్‌ చేస్తున్న ఇంజినీర్‌ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. చైన్నెలోని తాంబరం, చిట్లపాక్కానికి చెందిన ఇంజినీర్‌ మణిప్రసాద్‌ (21) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. అతను తాంబరంలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనితో అదే సంస్థలో పని చేస్తున్న స్నేహితురాలికి ముగప్పేర్‌ వెస్ట్‌ లోని కల్యాణ మండపంలో వివాహం జరిగింది.

ఇందులో మణిప్రసాద్‌, ఆయనతో పాటు పనిచేసే స్నేహితులు పాల్గొన్నారు. రిసెప్షన్‌ జరిగినప్పుడు ఓ పాటకు మణిప్రసాద్‌ ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తూ స్ఫృహతప్పి పడిపోయాడు. షాక్‌కు గురైన అతని స్నేహితులు శ్యామ్‌, భరత్‌ మణిప్రసాద్‌ను కీల్పాకం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మణిప్రసాద్‌ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. నొలంబూర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement