కేబినెట్‌లో​​​​​​​ కొత్త ముఖాలకు చోటు | - | Sakshi
Sakshi News home page

కేబినెట్‌లో​​​​​​​ కొత్త ముఖాలకు చోటు

May 9 2023 9:34 AM | Updated on May 9 2023 9:27 AM

- - Sakshi

సాక్షి, చైన్నె: రాష్ట్ర కేబినెట్‌లో మార్పులకు వేళైంది. సీఎం స్టాలిన్‌ తన మంత్రి వర్గంలో మార్పులకు సంబంధించిన తాజా జాబితాను సిద్ధం చేసినట్లు సచివాలయంలో చర్చ జోరందుకుంది. నలుగురు మంత్రులకు ఉద్వాసన పలికి, వారి స్థానంలో కొత్త ముఖాలకు అవకాశం కల్పించబోతున్నట్లు తెలుస్తోంది. వివరాలు.. రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యింది.

ఆదివారం మూడో వసంతంలోకి అడుగు పెట్టింది. గత కొంత కాలంగా పలువురు మంత్రుల పనితీరుపై సీఎం స్టాలిన్‌ అసంతృప్తితో ఉన్నట్లు ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి. వీరిలో కొందరిక ఉద్వాసన పలకడం, మరికొందరికి శాఖల్లో మార్పులు చేసే విధంగా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం మార్పుల జాబితా సిద్ధమైనట్లు తెలిసింది. బుధవారం ఈ జాబితా బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ జాబితాలో ఆర్థిక మంత్రి పళణి వేల్‌ త్యాగరాజన్‌, అటవీ శాఖ మంత్రి రామచంద్రన్‌తో పాటు మరో ఇద్దరు మంత్రుల పేర్లు గల్లంతయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement