సూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రం నుంచి కలెక్టరేట్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై సైడ్ డ్రెయిన్ నిర్మాణం కోసం ఇటీవల మున్సిపల్ అధికారులు తవ్వకాలు చేపట్టారు. తవ్విన మట్టిని రోడ్డుపైనే పోశారు. 20 రోజులుగా మట్టిని తొలగించక పోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై మట్టి కుప్పలు ఉండటంతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఇదే రోడ్డుపై నుంచి రాకపోకలు సాగిస్తున్నా సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు స్పందించి రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.


