తిరుమలగిరి మార్కెట్‌లో బస్తాల వివాదం | - | Sakshi
Sakshi News home page

తిరుమలగిరి మార్కెట్‌లో బస్తాల వివాదం

Nov 28 2026 1:50 AM | Updated on Nov 28 2026 1:50 AM

తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ప్లాస్టిక్‌ బస్తాలు వద్దని, జూట్‌ బస్తాలతోనే కాంటాలు వేస్తామంటూ హమాలీలు శుక్రవారం మార్కెట్‌ బంద్‌కు పిలుపు ఇచ్చారు. దాంతో మార్కెట్‌లో కాంటాలు నిలిచి పోయాయి. దీనికి వ్యతిరేకంగా మార్కెట్‌ పాలక వర్గం సభ్యులు, అర్తి అసోసియేషన్‌, స్వీపర్‌ యూనియన్‌, గుమస్తా యూనియన్‌, దడ్వాయి యూనియన్‌ నాయకులు మార్కెట్‌ యార్డు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రైతులు ఇబ్బందులు పడకుండా మార్కెట్‌ యార్డును సక్రమంగా నడపాలని కోరారు. మార్కెట్‌ యార్డు బంద్‌ కావడంతో వందలాది కుటుంబాలు వీధిన పడతారని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్‌పర్సన్‌ ఎల్సోజు చామంతి నరేష్‌, మార్కెట్‌ డైరెక్టర్లు రాపాక సోమేష్‌, దొడ్డ నరేష్‌, అర్తి అసోసియేషన్‌ అధ్యక్షుడు సంకెపల్లి నర్సింహారెడ్డి, సుధాకర్‌, సత్యనారాయణ, శేఖర్‌, ఉపేందర్‌, వెంకన్న, లక్ష్మణ్‌, రాములు, ప్రభాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కొలిక్కిరాని సమస్య..

సమస్య పరిష్కారానికి మార్కెట్‌ పాలకవర్గ సభ్యులు, అధికారులు హమాలీలతో పాటు వివిధ యూనియన్‌ నాయకులతో సమావేశం నిర్వహించారు. ధాన్యం కాంటాలు వేయడానికి జూట్‌ బస్తాలు మాత్రమే వినియోగించాలని, ప్లాస్టిక్‌ బస్తాలు వాడితే తాము కాంటాలు వేయమని హమాలీలు తేల్చి చెప్పారు. స్వీపర్‌ యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ జూట్‌ బస్తాలను మార్కెట్‌ యార్డులోకి మోసుకొచ్చేందుకు తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. దడ్వాయి యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ జూట్‌ బస్తాలలో ధాన్యం కాంటా వేస్తే తరుగు పోతుందని చెప్పారు. మొత్తం మీద ఎటూ తేల్చకుండానే సమావేశం ముగిసింది.

ఫ బంద్‌కు పిలుపునిచ్చిన హమాలీలు

ఫ నిరసన వ్యక్తం చేసిన ఇతర కార్మికులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement