ఏటీసీ ప్రిన్స్‌పాల్‌పై అధికారుల విచారణ | - | Sakshi
Sakshi News home page

ఏటీసీ ప్రిన్స్‌పాల్‌పై అధికారుల విచారణ

Nov 28 2026 1:50 AM | Updated on Nov 28 2026 1:50 AM

హుజూర్‌నగర్‌ : హుజూర్‌నగర్‌ ఏటీసీ కళాశాల ప్రిన్సిపాల్‌పై పలువురు ఉద్యోగులు, విద్యార్థులు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వరరావు తమను వేధిస్తున్నాడంటూ ఇటీవల కొంత మంది ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో గురువారం ఆ శాఖ రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సీతారాములు, ఏడీ శైలజ, కన్వీనర్‌ వెంకన్న ఏటీసీ సెంటర్‌లో విచారణ చేపట్టారు. విద్యార్థులు, ఉద్యోగులతో విడివిడిగా మాట్లా డి వివరాలు సేకరించారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందించనున్నారు.

అగ్నిమాపక ఉద్యోగుల

జిల్లా కార్యవర్గం ఎన్నిక

సూర్యాపేటటౌన్‌ : అగ్నిమాపక ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గాన్ని శుక్రవారం నల్లగొండలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా జి.పురుషోత్తం, ఉపాధ్యక్షుడిగా డి.ప్రకాష్‌, కార్యదర్శిగా ఎస్‌.రాకేష్‌, కోశాధికారిగా వీరబాబు ఎన్నికయ్యారు. కార్యవర్గాన్ని ఉద్యోగులు అభినందించారు.

బాల్య వివాహలు నేరం

చివ్వెంల(సూర్యాపేట) : బాల్య వివాహనాలు చట్టరీత్యా నేరమని సీనియర్‌ సివిల్‌ జడ్జి ఫర్హీన్‌ కౌసర్‌ అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు నిర్వహించిన అవగహన సమావేశంలో ఆమె మాట్లాడారు. బాలికలకు 18, బాలురకు 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేయాలన్నారు. బాల్య వివాహం వల్ల బాలికల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని, విద్య, కుటుంబ, ఆర్థిక సమస్యలు వస్తాయన్నారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని కష్టపడి చదవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ గోలి పద్మ, న్యాయవాదులు సుంకర రవి, సుజాత పాల్గొన్నారు.

వ్యవసాయ పరిశ్రమలతో యువతకు ఉపాధి

గరిడేపల్లి : గ్రామీణ యువత వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ద్వారా మంచి ఆదాయం పొందవచ్చని నాబార్డ్‌ జిల్లా అభివృద్ధి మేనేజర్‌ రవీందర్‌నాయక్‌ అన్నారు. శుక్రవారం గడ్డిపల్లి కేవీకేలో నాబార్డ్‌ ఆధ్వర్యంలో యువ శక్తి క్యాంపెయిన్‌ –2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యు వత తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని, వ్యవసాయాన్ని లాభదాయకమైన వ్యాపారంగా మలుచుకోవాలని సూచించారు. వ్యవసా య ఆధారిత పరిశ్రమలతో పాటు వివిధ రంగాల్లో యువతకు లభిస్తున్న అవకాశాలను వివరించారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు డి.నరేష్‌, కిరణ్‌, సుగంధి, అక్షిత సాయి, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ నాగ ప్రసాద్‌, రిటైర్డ్‌ డీడీఏ హుస్సేన్‌ బాబు, తదితరులు పాల్గొన్నారు.

వాహన దారులు

అప్రమత్తంగా ఉండాలి

సూర్యాపేటటౌన్‌ : జిల్లాలో చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కె. నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. తెల్లవారు జామున, రాత్రి సమయాల్లో పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు, రోడ్డు మార్గాలు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement