సూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జన సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక 60 ఫీట్ల రోడ్డు నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు తగుళ్ల జనార్దన్ యాదవ్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాగా ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల లేకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పోలోజు మహేష్చారి, నాయకులు వెంకటేష్ నాయక్, గాలి వికాస్, పరాల సాయి, ఏర్పుల రవి, పవన్, నక్క గంగరాజు, మంద శివ, ఉమేష్, రాజు, మహేష్, అశోక్, లింగరాజు తదితరులు పాల్గొన్నారు.


