ఉద్యాన పంటలకు ప్రభుత్వ రాయితీలు | - | Sakshi
Sakshi News home page

ఉద్యాన పంటలకు ప్రభుత్వ రాయితీలు

Nov 28 2026 1:50 AM | Updated on Nov 28 2026 1:50 AM

కోదాడరూరల్‌ : ఉద్యానవన పంటలను సాగు చేసే రైతులకు ప్రభుత్వం రాయితీలు అందిస్తున్నదని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమలశాఖ అధికారి తీగల నాగయ్య సూచించారు. శుక్రవారం మండలంలోని గుడిబండ, తొగర్రాయిలో సాగవుతున్న కూరగాయాల పంటలను పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు తక్కువ నీటితో సాగయ్యే కూరగాయాలను సాగు చేయాలని కోరారు. కూరగాయాలు సాగు చేసే రైతులకు విత్తనాల కోసం ఎకరాకు రూ.9600 నగదును ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుందన్నారు. ఆయన వెంట ఉద్యానవనశాఖ డివిజన్‌ అధికారి అనిత, హెచ్‌ఈఓ ఎస్‌కే.ఇస్మాయిల్‌, ఏఈఓ పిచ్చయ్య, రైతులు ఉన్నారు.

జిల్లా ఉద్యానవనశాఖ అధికారి నాగయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement