నేరేడుచర్ల : నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించడానికి ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోలేదా అని బీఆర్‌ఎస్ పార్టీ హుజూర్‌నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నేరేడుచర్లలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం సాగర్ ప్రాజెక్టు నుంచి తరలిస్తున్న నీటి లెక్కలకు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెబుతున్న లెక్కలకు ఎలాంటి పొంతన లేదని విమర్శించారు. నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నా.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. సమావేశంలో డీసీసీబీ మాజీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, బీఆర్‌ఎస్ మండల మాజీ అధ్యక్షుడు అరిబండి సురేష్‌బాబు, చెన్నబోయిన సైదులు, నాగండ్ల శ్రీధర్, కడియం వెంకట్‌రెడ్డి, చందమళ్ల జయబాబు, చిత్తలూరి పెద సైదులు, శ్రీకాంత్, మార్కెండేయ, పిచ్చిరెడ్డి, శేఖర్, రాజేష్, రాంరెడ్డి, సుందరయ్య, నాగార్జున, శ్రీను, సుందర్శన్, రామారావు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ నేత ఒంటెద్దు నర్సింహారెడ్డి


