భానుపురి(సూర్యాపేట): జిల్లాలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ ప్రేమ్‌రాజ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు రవితేజ, అనూష, డీసీహెచ్‌ఎస్ వెంకటేశ్వర్లు, డీఈఓ అశోక్ కుమార్, డీఐఈఓ సులోచనరాణి తదితరులు పాల్గొన్నారు.
ఉచిత న్యాయసేవలకే ‘లీగల్ ఎయిడ్ క్లినిక్’
అనంతరం కలెక్టరేట్‌లోని జిల్లా సంక్షేమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన న్యాయ సహాయ కేంద్రం (లీగల్ ఎయిడ్ క్లినిక్)ను మొదటి అదనపు జిల్లా జడ్జి డాక్టర్ పి.శివరామ్ ప్రసాద్, కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ప్రారంభించారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


