ఇంటిగ్రేటెడ్‌.. ఇంతే సంగతులా! | - | Sakshi
Sakshi News home page

ఇంటిగ్రేటెడ్‌.. ఇంతే సంగతులా!

Sep 27 2026 1:46 AM | Updated on Sep 27 2026 1:46 AM

ప్రజాప్రతినిధులు స్పందించాలి

కోదాడ : దినదినాభివృద్ధి చెందుతున్న కోదాడ పట్టణంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఐదేళ్ల క్రితం రూ.7.2 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన సమీకృత మార్కెట్‌ (ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌–నాన్‌వెజ్‌ మార్కెట్‌) నిర్మాణ పనులు ముందుకు సా గడం లేదు. పనులు నిలిచిపోయి ఏళ్లు గడుస్తున్నా పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్న మున్సిపల్‌ పబ్లిక్‌హెల్త్‌ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టర్‌ మాత్రం రూ.3కోట్ల వరకు పనులు చేసినా బిల్లులు రాలేదని పనులను ఆపివేశాడు. మున్సిపల్‌ పాలకవర్గం, స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించకపోవడంతో మార్కెట్‌ పనులు పునాదులకే పరిమితమయ్యాయి.

ఐదు ఎకరాల

స్థలం కేటాయింపు

పట్టణ నడిబొడ్డున ఉన్న కోదాడ వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలంలో రూ.7.2 కోట్ల నిధులతో కూరగాయలు, మటన్‌, ఫిష్‌ విక్రయాలను ఒకేదగ్గర కొనసాగించేలా బహుళ అంతస్తుల్లో సమీకృత మార్కెట్‌ను నిర్మించడానికి 2023 అక్టోబర్‌ 31న అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేశారు. పనులను దక్కించుకున్న హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్‌ వ్యవసాయ మార్కెట్‌లోని దక్షిణం వైపు నిర్మాణ పనులు మొదలు పెట్టి బేస్‌మట్టం వరకు పూర్తిచేశాడు. ఈలోగా ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. దీంతో ఇరుకుగా ఉన్న కూరగాయల మార్కెట్‌ను అలాగే కొనసాగిస్తున్నారు. ఇక, మాంసం విక్రయాలు పట్టణంలోని రోడ్ల వెంటే కొనసాగుతున్నాయి.

ఫ రూ.7.2 కోట్లతో పనులు ప్రారంభం

ఫ ఐదేళ్లవుతున్నా పునాదుల దశలోనే..

ఫ కూరగాయల మార్కెట్‌లో

సౌకర్యాలు కరువు

ఫ రోడ్ల వెంటే మాంసం విక్రయాలు

కోదాడలో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణ విషయంలో ప్రజాప్రతినిధులు మౌనంగా ఉండడం తగదు. రూ.కోట్ల ప్రజాధనం వెచ్చించి చేపట్టిన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులు మధ్యలోనే వదిలేయడం శోచనీయం. స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి మార్కెట్‌ నిర్మాణం త్వరగా పూర్తిచేయించాలి.

– కొల్లు వెంకటేశ్వరరావు,

రైతు సంఘం నాయకుడు, కోదాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement