పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Sep 27 2026 1:46 AM | Updated on Sep 27 2026 1:46 AM

చివ్వెంల(సూర్యాపేట): పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సహకారంతో ప్రత్యేక లోక్‌ అదాలత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో జిల్లా వ్యాప్తంగా 32 కేసులను పరిష్కరించి రూ.13.92 లక్షలను రికవరీ చేశారు. ముందుగా కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ రెండు మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే భవిష్యత్‌ తరాలకు బాటలు వేసిన వాళ్లం అవుతామన్నారు. ప్రస్తుత యాంత్రిక జీవన విధానంలో వాతావరణ కాలుష్యం పెరుతుందని, ఈ నేపథ్యంలో జీవకోటి ప్రాణధారమైన మొక్కలను నాటాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి బి.శివరాం ప్రసాద్‌, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.భవ్య, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఫర్హీన్‌ కౌసర్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి మంచాల మమత, రీజనల్‌ మేనేజర్‌ అనిల్‌కుమార్‌, చీఫ్‌ మేనేజర్‌ జి.మోహన్‌కుమార్‌, సీహెచ్‌.ఫణికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ జిల్లా ప్రధాన జడ్జి

లక్ష్మీశారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement