భారం కాదు.. ఆభరణం | - | Sakshi
Sakshi News home page

భారం కాదు.. ఆభరణం

Sep 27 2026 1:46 AM | Updated on Sep 27 2026 1:46 AM

మా కూతుళ్లు బంగారం

ఫ రంగం ఏదైనా.. మాదే అందలం అంటున్న అమ్మాయిలు

ఫ ఆడపిల్ల భారమనే భావనను తుడిచేస్తున్న యువతులు

ఫ మాకు ఆడపిల్లే కావాలని సగర్వంగా చెబుతున్న తల్లిదండ్రులునేడు కూతుళ్ల దినోత్సవం

– రొండ్ల రాంరెడ్డి, స్వప్న

రాజాపేట : మాది రాజాపేట మండలం కుర్రారం. మా ఇద్దరు కూతుళ్లు. మగవారికి తీసిపోకుండా ఉన్నంతలో చదివించాం. పెద్ద కుమార్తె ప్రీతిరెడ్డి జాల గ్రామంలోని జకారియాస్‌ పాఠశాలలో 6వ తరగతి వరకు, హైదరాబాద్‌లో ఇంటర్‌తో పాటు బీటెక్‌ చదివించాం. ఆమె ప్రస్తుతం టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది. ఇక చిన్నకుమార్తె శ్రావణిని జాల గ్రామంలోని జకారియాస్‌ పాఠశాలలో 10వ తరగతి వరకు, హైదరాబాద్‌లో ఇంటర్‌, ఘట్కేసర్‌లో బీఫార్మసీ చదివించాం. చిన్నకుమార్తె కరోనా సయమంలో ఎన్నికష్టాలు వచ్చినా, కరోనా బారినపడినా భయపడకుండా యూకేకు వెళ్లి ఎంఫామ్‌ పూర్తి చేసి మెడికల్‌ ఫీల్డ్‌లో ఉద్యోగం చేస్తోంది. మా అమ్మాయిలను కొడుకుల్లా భావించి చదివించాం. వారు మాతో స్నేహంగా ఉంటారు. మేము చెప్పినట్టే నడుచుకుంటారు. ఏనాడూ ఎదురు చెప్పలేదు. అబ్బాయిలకంటే కూతుళ్లే నయం మా కూతుళ్లు బంగారం. ఆ దేవుడు మాకు ఆడపిల్లలను ఇచ్చి ఎంతో మేలు చేశాడు.

మరికొన్ని కథనాలు 8లో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement