మిల్లెట్స్‌ స్నాక్స్‌ | - | Sakshi
Sakshi News home page

మిల్లెట్స్‌ స్నాక్స్‌

Sep 27 2026 1:46 AM | Updated on Sep 27 2026 1:46 AM

మంచి ఆదరణ లభిస్తోంది

చిరుధాన్యాల బిస్కెట్స్‌, ఐస్‌క్రీం

మట్టపల్లిలో నిత్య కల్యాణం

మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో శనివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో శ్రీస్వామి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేసి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం జరిపారు. ఎదుర్కోళ్ల మహోత్సవ అనంతరం విష్వక్సేనారాధన, మాంగళ్యధారణ, తలంబ్రాలతో నిత్య కల్యాణం చేపట్టారు. భక్తులకు తీర్థప్రసాదాల అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలుచెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈఓ చలపతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

ఫ ఇప్పటికే అందుబాటులో మిల్లెట్స్‌ ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్‌

ఫ పిండి వంటల్లోనూ మిల్లెట్స్‌కు ప్రాధాన్యం

మా హల్వా అంగడిలో మిల్లెట్‌ టిఫిన్స్‌, స్నాక్స్‌ ప్రత్యేకంగా తయారు చేస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి కూడా కస్టమర్లు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తాటి బెల్లంతో చేసిన టీ, కాఫీ, పాలు, ఐస్‌క్రీమ్స్‌, హల్వా, మైసూర్‌పాక్‌ కూడా మా వద్ద లభిస్తాయి.

– జానిబాబు, షాపు నిర్వాహకుడు, తూప్రాన్‌పేట

చౌటుప్పల్‌, చిట్యాల :. టిఫిన్లు, ఐస్‌క్రీంలు, పిండి వంటలు అందరికీ ఇష్టమే. చిరుధాన్యాలతో చేసిన టిఫిన్లు ఇప్పటికే అందుబాటులో ఉండగా ప్రస్తుతం ఐస్‌క్రీంలు, స్నాక్స్‌ తయారవుతున్నాయి. చాలా చోట్ల చిరుధాన్యాలతో చేసిన ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్‌ దొరుకుతున్నాయి. ఇప్పుడు మిల్లెట్స్‌తో చేసిన బిస్కెట్లు, పిండి వంటలు కూడా అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో చౌటుప్పల్‌ మండలం తూప్రాన్‌పేట శివారులో గల హల్వా అంగడిలో చిరుధాన్యాలతో చేసిన ఇడ్లీ, దోశ, పెసరట్టుతో పాటు సజ్జ, జొన్నలతో చేసిన రకరకాల మిల్లెట్‌ బిస్కెట్లు, పిండి వంటలు లభిస్తున్నాయి. సాయంత్రం వేళ వేడివేడి మిల్లెట్‌ స్నాక్స్‌ ఇక్కడి ప్రత్యేకత. ఆరోగ్యానికి మంచి చేసే స్నాక్స్‌ను ప్రజలు ఇష్టపడి మరీ ఆరగిస్తున్నారు.

సాధారణంగా ఐస్‌క్రీమ్‌ అనగానే పాలు, పండ్లు, చాక్లెట్‌, వెనిల్లా వంటి రుచులే గుర్తుకొస్తాయి. కానీ, చిరుధాన్యాలతో తయారయ్యే ఐస్‌క్రీమ్‌లు ఇప్పుడు ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ పరిధిలో గల ‘విలేజ్‌ ఆర్గానిక్‌ హోటల్‌’లో ఏర్పాటు చేసిన మిల్లెట్స్‌ ఐస్‌క్రీమ్‌ స్టాల్‌లో పిస్తా, ఆల్మండ్‌, స్ట్రాబెర్రీ, ఓరియో, మ్యాంగో, బనానా, గ్రేప్స్‌, జాక్‌ఫ్రూట్‌, కస్టర్డ్‌ యాపిల్‌, చాక్లెట్‌ వంటి పది రకాల ఫ్లేవర్లలో మిల్లెట్స్‌ ఐస్‌క్రీమ్‌లు లభిస్తున్నాయి. ఆయా ఫ్లేవర్ల ఐస్‌క్రీంలలో రాగి, జొన్న, సజ్జలు వంటి మిల్లెట్స్‌ను కలిపి అందిస్తున్నారు. వీటిని హైదరాబాద్‌లో ప్రత్యేకంగా తయారు చేయించి ఇక్కడ విక్రయిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఒక్కో ఐస్‌క్రీమ్‌ ధర రూ.130 నుంచి రూ.150 వరకు ఉంది. ఆర్గానిక్‌ పదార్థాలు, చిరుధాన్యాలతో తయారు చేయడం వల్ల ప్రయాణికులు వీటిని రుచి చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరగడంతో వారి ఆహారపు అలవాట్లలో చాలా వరకు మార్పులు వచ్చాయి. ఉదయం టిఫిన్‌ నుంచి సాయంత్రం స్నాక్స్‌ వరకు రాగులు, జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలకే జనం పెద్దపీట వేస్తున్నారు. మధుమేహ బాధితులతో పాటు ఆరోగ్య ప్రియుల అభిరుచులకు అనుగుణంగా హోటళ్ల నిర్వాహకులు సైతం మిల్లెట్స్‌తో చేసిన బిస్కెట్స్‌, ఐస్‌క్రీంలు, పిండి వంటలు అందుబాటులో ఉంచుతూ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement