కబడ్డీ పోటీల విజేత కరివిరాల జట్టు | - | Sakshi
Sakshi News home page

కబడ్డీ పోటీల విజేత కరివిరాల జట్టు

Aug 31 2026 1:32 AM | Updated on Aug 31 2026 1:32 AM

హుజూర్‌నగర్‌ : జిల్లా మోడ్రన్‌ కబడ్డీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మోర్తాల నాగిరెడి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి అండర్‌–17 బాలికల కబడ్డీ పోటీలు ఆదివారం ముగిసాయి. పోటీల్లో మొత్తం 18 జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో మొదటి బహుమతి కరివిరాల మోడల్‌ స్కూల్‌ కై వసం చేసుకోగా రెండవ బహుమతి ఏంజేపీ అనంతగిరి, మూడవ బహుమతి జడ్పీహెచ్‌ఎస్‌ గరిడేపల్లి, నాల్గవ బహుమతి హైదరాబాద్‌ జూనియర్‌ కళాశాల కోదాడ జట్టు గెలుచుకుంది. విజేతలకు జిల్లా మోడ్రన్‌ కబడ్డీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మోర్తాల నాగిరెడ్డి బహుమతులు అందించారు. కార్యక్రమంలో జిల్లా మోడ్రన్‌ కబడ్డీ అసోసియేషన్‌ సభ్యులు మట్టపల్లి సతీష్‌గౌడ్‌, సీహెచ్‌ వీరయ్య, లెనిన్‌, పీఈటీలు కొండ నాగయ్య, బండారు సురేష్‌, వీరస్వామి, హుస్సేన్‌, గురవయ్య, కబడ్డీ క్రీడాకారుడు యాదగిరి, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement