నిషేధమున్నా.. వినియోగం ఆగట్లే! | - | Sakshi
Sakshi News home page

నిషేధమున్నా.. వినియోగం ఆగట్లే!

Aug 31 2026 1:32 AM | Updated on Aug 31 2026 1:32 AM

ప్లాస్టిక్‌ నిషేధానికి అందరి సహకారం అవసరం

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధ అమలుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. విక్రయదారులకు నోటీసులు జారీ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నాం. ఈ నిషేధం పూర్తిస్థాయిలో అమల కావడానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది అందరి సహకారం ఎంతో అవసరం.

– కత్తి సతీష్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌, హుజూర్‌నగర్‌

హుజూర్‌నగర్‌ : పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్న సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నియంత్రణలో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న పాలిథిన్‌ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు, స్ట్రాల తయారీ, విక్రయం, వినియోగంపై పూర్తి నిషేధం ఉంది. ఉల్లంఘిస్తే రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానాతోపాటు వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయాల్సి ఉంది. అయితే అధికారుల తనిఖీలు మొక్కుబడిగా మారడంతో ప్లాస్టిక్‌ విక్రయాలు, వినియోగం యథేచ్ఛగా జరుగుతోంది. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోగా పర్యావరణానికి తీవ్రమైన హాని కలుగుతోంది.

రోజూ పది మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు..

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో నిత్యం సుమారు 100 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా, అందులో 10 మెట్రిక్‌ టన్నుల వరకు ప్లాస్టిక్‌ వ్యర్థాలే ఉంటున్నాయి. షాపింగ్‌ మాల్స్‌ నుంచి రోడ్డు పక్కన విక్రయించే దుకాణాల వరకు పాలిథిన్‌ కవర్ల వాడకం విచ్చలవిడిగా సాగుతోంది.

పట్టణాల్లోనే అధికంగా..

జిల్లాలో ఎక్కువ శాతం పట్టణాల్లో ఎక్కడ చూసినా రోడ్ల పక్కన ప్లాస్టిక్‌ వ్యర్థాలు కనిపిస్తున్నాయి. మున్సిపల్‌ సిబ్బంది ఎక్కువగా వ్యాపార సముదాయాల నుంచి నిత్యం ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరిస్తున్నారు. చిరు వ్యాపారుల నుంచి పెద్ద దుకాణాల వరకు ప్రతిఒక్కరూ ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నారు. పండుగల నేపథ్యంలో వీటి వినియోగం మరింత పెరుగుతూ పోతోంది. నిబంధనల ప్రకారం పాలిథీన్‌ వ్యర్ధాలను ప్రత్యేక డబ్బల్లోనే వేయాల్సి ఉన్నా దానిని విస్మరిస్తున్నారు. రోడ్డు వెంబడి ప్లాస్టిక్‌ కవర్లలో వివిధ ఆహార పదార్థాలను పడేస్తుండటం వల్ల రోడ్లపై తిరిగే మూగజీవులు వాటిని తింటూ తీవ్ర అస్వస్థతకు గురవుతూ చనిపోతున్నాయి. ఇప్పటికై నా అధికారులు నామమాత్రపు చర్యలు వీడి, ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, పట్టణాల్లో ప్లాస్టిక్‌ విక్రయాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మున్సిపాలిటీ వార్డులు చెత్త ఉత్పత్తి ప్లాస్టిక్‌ వ్యర్థాలు

సూర్యాపేట 48 50 05

కోదాడ 35 23 03

హుజూర్‌నగర్‌ 28 16 01

నేరేడుచర్ల 15 05 0.7

తిరుమలగిరి 15 0.3

యథేచ్ఛగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ విక్రయాలు

నియంత్రణలో యంత్రాంగం విఫలం

మున్సిపాలిటీల్లో

పేరుకుపోతున్న వ్యర్థాలు

అమలుకు నోచుకోని నిషేధాజ్ఞలు

పర్యావరణానికి, మూగజీవుల ప్రాణాలకు ముప్పు

రోజువారీగా సేకరించే చెత్త, వెలువడే

ప్లాస్టిక్‌ వ్యర్థాలు (మెట్రిక్‌ టన్నుల్లో..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement