తుంగతుర్తి : టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ నిర్ణయం వచ్చే వరకు తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలు వేయవద్దని డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో మండల, పార్టీ నియామకాల కారణంగా సొంత పార్టీలో భేదాభిప్రాయాలు వచ్చాయన్నారు. నూతన అధ్యక్షుల ఎంపిక ప్రక్రియపై తుది నిర్ణయం వచ్చే వరకు నియోజకవర్గంలో గ్రామ కమిటీలు వేయవద్దని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కమిటీలు వేసి, మళ్లీ పార్టీలో గందరగోళం సృష్టించవద్దని, పార్టీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని హితవు పలికారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దొంగరి గోవర్ధన్, మడ్డి కృష్ణమూర్తి పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య


