సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

Aug 28 2026 2:33 AM | Updated on Aug 28 2026 2:33 AM

భానుపురి (సూర్యాపేట): ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపి, తమను చర్చలకు ఆహ్వానించాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య వేదిక (టీజీఈజేఏసీ) జిల్లా సెక్రటరీ జనరల్‌ భూపాల్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండో పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయాలని కోరారు. అలాగే సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు హెల్త్‌ కార్డులను సక్రమంగా వర్తింపజేయడంతో పాటు ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసి జీఓ 25ను సవరించాలని ప్రభుత్వాన్ని కోరారు. సెప్టెంబర్‌ 10వ తేదీన ఇందిరాపార్క్‌ వద్ద జరగనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్‌ సెక్రటరీ జనరల్‌ తంగెళ్ల జితేందర్‌ రెడ్డి, రాధాకృష్ణ, కో చైర్మన్లు ఎన్‌.సోంబాబు, పి.వీరన్న, షేక్‌ ఉమర్‌, నిమ్మల శ్రీనివాస్‌, సీతారామయ్య, నాగేశ్వరరావు, మన్నెం యాదగిరి, పాండు నాయక్‌, నాగేందర్‌, లక్కపాక ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌.రవికుమార్‌, ఆకాష్‌ వర్మ, సైదులు, డి.బాలు నాయక్‌, బంధం వెంకటేశ్వర్లు, అనిత, పద్మావతి, పి.శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు.

ఫ సీపీఎస్‌ రద్దుచేసి ఓపీఎస్‌

పునరుద్ధరించాలి

ఫ కలెక్టరేట్‌ ఎదుట టీజీఈజేఏసీ ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement