సూర్యాపేట : కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్చడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుట్రను భగ్నం చేసే వరకు, సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ వచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జాతీయ రహదారి 65కి సమాంతరంగా బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14 నుంచి అఖిలపక్షాల ఆధ్వర్యంలో పట్టణంలోని వాణిజ్య భవన్ సెంటర్లో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం కొనసాగాయి. దీక్షల్లో సీపీఐ అనుబంధ జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉత్సల సృజనతో పాటు 16 మంది మహిలు కూర్చున్నారు. దీక్షలను సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, అనంతుల మల్లేశ్వరి, దంతాల రాంబాబు, ఏడేళ్ల శ్రీకాంత్ ప్రారంభించారు. దీక్షలకు బీఆర్‌ఎస్ నాయకులు సంఘీభావం తెలిపి మాట్లాడారు. సంఘీభావం తెలిపిన వారిలో మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంగిరేకుల నాగార్జున, నాయకులు బండారు రాజా, జీడి భిక్షం, బొమ్మగాని శ్రీనివాస్, గండూరి కృపాకర్, రేణుబాబు, సయ్యద్, నాగమణి, అఖిలపక్ష నాయకులు, స్థానికులు ఉన్నారు.
ఐదో రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలు


