మోటకొండూర్ : ద్విచక్ర వాహనంపై నుంచి పడి యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మోటకొండూర్ మండల కేంద్రంలో సోమవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోటకొండూర్ మండల కేంద్రానికి చెందిన గంధమల్ల రాజు(29) ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి సడెన్‌గా బ్రేక్ వేశాడు. దీంతో అతడు జారి పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే అంబులెన్స్‌లో బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కుమారస్వామి తెలిపారు.


