యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలోని విష్ణు పుష్కరిణి సమీపంలో భారీ మండపం ఏర్పాటు కానుంది. రూ.43.12 కోట్లతో దీక్షాపరుల మండపం, కారు, బైక్ పార్కింగ్, సెల్లార్ పార్కింగ్, డార్మిటరీ హాల్ నిర్మించనున్నారు. ఈ మండపంలో మూడు సెల్లార్స్ రానున్నాయి. ఇందులో 550 ద్విచక్ర వాహనాలు, 310 కార్లు పార్కింగ్ చేసేలా నిర్మాణం జరగనుంది. అంతేకాకుండా భక్తులు బస చేసేందుకు 34 గదులు, 300 మంది భక్తులు ఉండే విధంగా డార్మిటరీ హాల్, సుమారు 320 మంది మండల దీక్ష చేసే భక్తుల కోసం దీక్షాపరుల మండపాన్ని నిర్మాణం చేయనున్నారు.


