‘కల్యాణ లక్ష్మి’ ఎత్తివేతకు కాంగ్రెస్‌ కుట్ర | - | Sakshi
Sakshi News home page

‘కల్యాణ లక్ష్మి’ ఎత్తివేతకు కాంగ్రెస్‌ కుట్ర

Aug 18 2026 7:58 AM | Updated on Aug 18 2026 7:58 AM

కోదాడ : పేదింటి ఆడబిడ్డల కోసం మాజీ సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన కల్యాణ లక్ష్మి, షాదీముబారాక్‌ పథకాన్ని ఎత్తివేయడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ ఆరోపించారు. కల్యాణ లక్ష్మి పథకంపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ సోమవారం కోదాడ బస్టాండ్‌ సెంటర్‌లోని గాంధీ విగ్రహం వద్ద బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఈ పథకాలకు ఇస్తున్న లక్ష రూపాయలకు అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ నాయకులు నేడు ఆ పథకాలను లేకుండా చేయాలనుకుంటున్నారన్నారు. దీనివల్ల పేద ఆడబిడ్డల వివాహం చేసిన తల్లిదండ్రులకు గత ప్రభుత్వం అందించిన ఆర్థిక చేయూత అందకుండా పోనుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ పథకానికి నిధులను విడుదల చేసి అర్హులైన పేదలను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎస్‌కె.నయీం, కౌన్సిలర్‌ చీమ నరేష్‌, తుమ్మలపల్లి భాస్కర్‌, అజంతా, చింతా కవిత, భూపాల్‌రెడ్డి, జానకిరామాచారి, దొంగరి లక్ష్మీనారాయణ, తాళ్లూరి శ్రీనివాస్‌, పద్మ, విజయలక్ష్మి, పోట్ట విజయ, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు

భానుపురి (సూర్యాపేట) : కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోంస్తుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ అన్నారు. పెండింగ్‌లో ఉన్న కల్యాణ లక్ష్మి నిధులు విడుదల చేయాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌లో మహిళలతో కలిసి కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌కు వినతిపత్రం అందించి మాట్లాడారు. పథకానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, అర్హులైన లబ్ధిదారులకు నిధులు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement