మఠంపల్లి : మండలంలోని మట్టపల్లి రెవెన్యూ పరిధిలో గల సుల్తాన్‌పూర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఎన్‌సీఎల్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం అక్రమంగా నిర్మించిన కట్టడాలను సోమవారం సూర్యాపేట, నల్లగొండ జిల్లాల ఫారెస్ట్, పోలీసు శాఖల అధికారులు జేసీబీల సహాయంతో తొలగింజేశారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి (డీఎఫ్‌ఓ) కె.దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్‌సీఎల్ సిమెంట్ పరిశ్రమ వారు ఎలాంటి అనుమతులు లేకుండా సుల్తాన్‌పూర్ రిజర్వ్ ఫారెస్ట్‌లోని మట్టపల్లి రెవెన్యూ సర్వేనంబర్ 88లో గల 12.6 ఎకరాల భూముల్లో అక్రమంగా భారీ రేకుల షెడ్లు, వాటర్ ప్లాట్లు, ప్రహరీ, సీసీ రోడ్డు నిర్మించారన్నారు. దీనిపై రెండు మాసాల క్రితమే నోటీసులు అందజేయగా వారు సమర్పించిన సర్టిఫికెట్లు, ఆధారాలను పరిశీలించగా అవి అటవీ భూములుగా నిర్ధారించామన్నారు. సదరు పరిశ్రమ హైకోర్టును ఆశ్రయించగా విచారణ అనంతరం కోర్టు ఉత్తర్వుల మేరకు అక్రమ నిర్మాణాలను తొలగింపజేస్తున్నట్లు తెలిపారు. ఫారెస్ట్ భూములను ఎవరు ఆక్రమించినా చట్టరీత్యా చ్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజర్ అధికారులు కిరణ్‌కుమార్, ఆదిత్య, బీట్ ఆఫీసర్లు, పోలీసులు పాల్గొన్నారు.


