రేపటి నుంచి స్మార్ట్‌ రేషన్‌ కార్డులు | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి స్మార్ట్‌ రేషన్‌ కార్డులు

Aug 15 2026 2:15 AM | Updated on Aug 15 2026 2:15 AM

భానుపురి (సూర్యాపేట) : రేషన్‌ కార్డులు స్మార్ట్‌గా మారనున్నాయి. ఏటీఏం తరహాలో క్యూర్‌ కోడ్‌తో లబ్ధిదారుని పూర్తి వివరాలు నిక్షిప్తం చేసిన కార్డులను ఇప్పటికే రేషన్‌కార్డులు ఉన్న వారికి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సూర్యాపేట జిల్లాలో ఈ నెల 16 నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ఇరిగేషన్‌, సివిల్‌ సప్లయ్‌శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా వీటిని లబ్ధిదారులకు అందించనున్నారు.

జిల్లాలో 3,71,783 కార్డులు..!

జిల్లాలో 610 రేషన్‌ షాపులు ఉండగా, వాటి పరిధిలో ఈ ఏడాది కొత్తగా మంజూరు చేసిన వాటితో కలుపుకొని 3,71,783 రేషన్‌న్‌కార్డులు ఉన్నాయి. ప్రభుత్వం రూపొందించిన స్మార్ట్‌ కార్డులను వారందరికీ పంపిణీ చేయనున్నారు. మంత్రి చేతుల మీదుగా లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఆ తరువాత ప్రభుత్వం నుంచి వెలువడే మార్గదర్శకాల ప్రకారం కార్డులను పంపిణీ చేస్తామని అధికారులు వెల్లడించారు.

ఏటీఎం కార్డు తరహాలో..!

ఇప్పటి వరకు కాగితంపై ఉన్న రేషన్‌న్‌ కార్డుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా స్మార్ట్‌ కార్డులను రూపొందించింది. ఏటీఎం కార్డు పరిమాణంలో ఉండే ఈ డిజిటల్‌ కార్డులు చిరిగి పోకుండా, తడవకుండా పూర్తి భద్రతా ప్రమాణాలతో తయారు చేశారు. కార్డుపై కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల పేర్లతోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటోలను ముద్రించారు.

కార్డులోనే పూర్తి సమాచారం

స్మార్ట్‌ రేషన్‌న్‌కార్డులో ప్రత్యేకంగా క్యూఆర్‌ కోడ్‌ను పొందుపరిచారు. రేషన్‌ షాపులో కార్డును స్కాన్‌ చేయగానే కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఇదే కార్డును బహుళ ప్రయోజనాలకు ఉపయోగించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

3.71 లక్షల మందికి పంపిణీకి ఏర్పాట్లు

ఏటీఎం కార్డు తరహాలో రూపకల్పన

క్యూఆర్‌ కోడ్‌తో పూర్తి వివరాలు

సూర్యాపేట జిల్లాలో రేషన్‌ కార్డులు ఇలా..

నియోజకవర్గం రేషన్‌ షాపులు స్మార్ట్‌ కార్డులు

సూర్యాపేట 171 93,770

హుజూర్‌నగర్‌ 188 1,07,631

కోదాడ 146 98,716

తుంగతుర్తి 105 71,666

మొత్తం 610 3,71,783

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement