హుజూర్‌నగర్ : గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయిస్తే చర్యలు తప్పవని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి. జ్యోతిర్మయి హెచ్చరించారు. శుక్రవారం హుజూర్‌నగర్‌లో పలు కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు, హోటళ్లలో ఆమె తనిఖీలు నిర్వహించారు. ఆహార పదార్థాల నాణ్యత, పప్పులు, కాలం చెల్లిన పదార్థాలు, ప్రభుత్వం నిషేధించిన ఉత్పత్తులపై సోదాలు చేశారు. అనుమానాస్పద పదార్థాల నమూనాలను సేకరించి, పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. ఆహార వ్యాపారులు, హోటల్ నిర్వాహకులు తప్పనిసరిగా లైసెన్స్ పొందాలని సూచించారు. పజల ఆరోగ్యానికి హాని కలిగించే రంగులు, ఆహార పదార్థాలు, లూస్ టీ పౌడర్స్, ఆయిల్స్ విక్రయించవద్దన్నారు. ఇటీవల కొంతమంది తాము ఫుడ్ ఇన్‌స్పెక్టర్లమంటూ వ్యాపారులను భయపెట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయని, అటువంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలా ఎవరైనా బెదిరిస్తే వెంటనే స్థానిక పోలీసులకు, ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆమె వెంట ఫుడ్ సేఫ్టీ అధికారి బి ప్రభాకర్, సిబ్బంది ఉన్నారు.
అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి


