అర్వపల్లి : విద్యార్థులు ఒకరికొకరు పోటీపడి చదవాలని డీఆర్‌డీఓ ఆర్.సన్యాసయ్య సూచించారు. అర్వపల్లిలోని పీఎంశ్రీ జడ్పీహెచ్‌ఎస్‌లో శుక్రవారం 300 మంది విద్యార్థులకు సెర్ఫ్ ఆధ్వర్యంలో యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తన తల్లి పేరున పాఠశాలలో ఒక మొక్క నాటి సంరక్షించాలని సూచించారు. బాలికలు సైకిల్ నేర్చుకోవడానికి వీలుగా ప్రతి మండలానికి డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో 5 సైకిళ్లను కేటాయించినట్లు చెప్పారు. అనంతరం పాఠశాలలో మొక్క నాటారు. మధ్యాహ్న భోజనాన్ని, ల్యాబ్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ట్రైనీ అదనపు కలెక్టర్లు రవితేజ, అనూష, సర్పంచ్ చిల్లంచర్ల విద్యాసాగర్, ఏపీఎంలు రాంబాబు, వెంకన్న, హెచ్‌ఎం పి.మల్లేష్, ఏపీసీ ఛైర్‌పర్సన్ మేకల సునీతరాంబాబు, సీసీ యాదగిరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
డీఆర్‌డీఓ సన్యాసయ్య


