చివ్వెంల(సూర్యాపేట) : యువత చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ అన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా బుధవారం సూర్యాపేట పట్టణంలోని బీఎన్‌ఆర్ జూనియర్ కళాశాలలో సాధికార యువత–బలమైన భారతదేశం అనే అంశంపై యువకులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ప్రలోభాలకు గురికావద్దన్నారు. సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తల్లమళ్ల హస్సేన్, నామినేటేడ్ సభ్యుడు గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


