హుజూర్‌నగర్ : ఆటల పోటీలతో విశ్రాంత ఉద్యోగుల్లో నూతన ఉత్సాహం వస్తున్నదని ప్రభుత్వ పెన్షనర్ల సంఘం కార్యదర్శి కొప్పుల వీరారెడ్డి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హుజూర్‌నగర్‌లోని సంఘం కార్యాలయంలో మంగళవారం పెన్షనర్ల ఆటల పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యారమ్స్ సింగిల్స్, డబుల్స్, జూనియర్ సింగిల్స్, డబుల్స్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో 20 మంది పెన్షనర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు ఈ నెల 15న బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం నాయకులు, పెన్షనర్లు పాల్గొన్నారు.


