రేషన్ లబ్ధిదారులకు నూతనంగా స్మార్ట్‌కార్డులను అందించనుంది. అందుకు అనుగుణంగా కుటుంబానికి ఒకటి చొప్పున స్మార్ట్ కార్డులు అందజేయనున్నారు. ఇప్పటికే జిల్లాకు 3,70,000 కార్డులు చేరుకున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన తేదీ ప్రకారం స్మార్ట్ కార్డులు పంపిణీ చేయనున్నాం.
– మోహన్‌బాబు,
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
చిలుకూరు: పేద, మధ్య తరగతి ప్రజలకు పౌర సరఫరాల శాఖ ద్వారా అందే రేషన్ సర్వీసులు ఇక మరింత స్మార్ట్‌గా మారనున్నాయి. అర్హులైన ప్రతి కుటుంబానికి డెబిట్ కార్డు సైజులో క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయనుంది. ఈమేరకు జిల్లాకు 3,70,000 కార్డులు జిల్లాకు చేరుకున్నాయి. వచ్చే నెలలోనే ఈ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.
చిరిగిపోవు.. కాగితాలతో తిప్పలుండవు
ఇప్పటివరకు ప్రత్యేకంగా కార్డులు లేకపోవడంతో లబ్ధిదారులు శ్రీమీ–సేవశ్రీ ద్వారా పొందిన పేపర్ రేషన్ కార్డులపైనే ఆధారపడుతున్నారు. అవి త్వరగా చిరిగిపోవడం, కార్డు నంబర్లు చెరిగిపోవడంతో వృద్ధులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా నీటిలో తడిచినా పాడవని రీతిలో క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డులను రూపొందిస్తున్నారు.
స్కాన్ చేస్తే వివరాలు ప్రత్యక్షం
స్మార్ట్ కార్డుపై యజమాని పేరు, చిరునామా ఉండటంతో పాటు సీఎం , పౌర సరఫరాల శాఖ మంత్రి ఫొటో ఉండనుంది. లబ్ధిదారు రేషన్ షాఫుకు వెళ్లి డీలర్‌కు కార్డు అందజేస్తే తన వద్ద ఉన్న ఈ పాస్ యంత్రంలో స్కాన్ చేస్తారు. అందులో లబ్ధిదారుల వివరాలు సమగ్రంగా కనిపిస్తాయని అధికారులు పేర్కొంటున్నారు.
మూడు నెలల బియ్యం ఒకేసారి
జిల్లా వ్యాప్తంగా 610 రేషన్ షాపులు ఉండగా ప్రస్తుతం 3,55,057 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిల్లో 9,85,061 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ షాపుల ద్వారా ప్రతి నెలా సుమారుగా 6వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. వచ్చేనెల ఒకేసారి మూడు నెలల బియ్యం ఇవ్వాలని నిర్ణయించారు. కనుక రేషన్ షాపులకు మొత్తం 18వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. అయితే లబ్ధిదారులు వచ్చే నెల రేషన్ షాపుకు వచ్చి ఒకేసారి మూడు నెలలకు సంబంధించి అదే సమయంలో మూడు సార్లు బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. అప్పుడు రేషన్ డీలర్లు మూడు నెలల బియ్యాన్ని లబ్ధిదారులకు అందజేస్తారు.
ఫ జిల్లాకు చేరిన 3.70 లక్షల కార్డులు
ఫ త్వరలో పంపిణీ చేయనున్న అధికారులు


