రత్నవరం సమీపాన మా పొలాల వద్ద గతంలో కొత్తగూడెం మేజర్‌కు నిత్యం గండ్లు పడి పొలాలు నీట మునిగేవి. కాల్వ కట్ట బలహీనంగా ఉంది. పలుచోట్ల పూడింది. కాల్వ ఆధునీకరణ కోసం నిధులు మంజూరు చేయడం చాలా ఆనందంగా ఉంది.
– సోమ శ్రీను, రైతు, రత్నవరం
కొత్తగూడెం మేజర్ ఆధునీకరణ పనుల కోసం ప్రభుత్వం రూ.39.57 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం టెండర్ ప్రక్రియలో ఉంది. టెండర్ ప్రక్రియ పూర్తవ్వగానే పనులు ప్రారంభిస్తాం. ఆధునీకరణ పనులతో చివరి భూములకు నీరందుతుంది.
– సీహెచ్.భూషణాచారి, డీఈ


