కాంగ్రెస్‌ నేతల అరెస్ట్‌ అప్రజాస్వామికం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నేతల అరెస్ట్‌ అప్రజాస్వామికం

Jul 23 2026 2:00 AM | Updated on Jul 23 2026 2:00 AM

భానుపురి (సూర్యాపేట) : కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టులు అప్రజాస్వామికమని, ఈ చర్య ముమ్మాటికీ హక్కులపై దాడేనని ఏఐసీసీ పరిశీలకుడు షేక్‌ మస్తాన్‌ వలీ అన్నారు. న్యూఢిల్లీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని అరెస్ట్‌ చేయడాన్ని ఖండిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్‌రోడ్డులోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య ఆధ్వర్యంలో శాంతియుత నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, టూరిజం కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డిలతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. నీట్‌ పరీక్ష పేపర్‌ లీక్‌తో బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పోతు భాస్కర్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మొరిశెట్టి నివేదిత తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల కోసమే రాహుల్‌గాంధీ పోరాటం

విద్యార్ధుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పోరాటం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఏఐసీసీ పరిశీలకుడు షేక్‌ మస్తాన్‌ వలీ, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని 60 ఫీట్ల రోడ్డులో సృజన స్కూల్‌ గ్రౌండ్స్‌లో యువజన కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి నాగిరెడ్డి మమత సందీప్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీఛాత్రోన్‌ కీ గూంజ్ఙ్‌ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు పోతు భాస్కర్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మొరిశెట్టి నివేదిత, వైస్‌ చైర్మన్‌ యండి షఫీ ఉల్లా, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ కుమ్మరి కుంట్ల వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement