సూర్యాపేటటౌన్ : జిల్లాలో వృద్ధుల రక్షణ, భద్రతకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీని యర్ సిటిజన్ భద్రత కమిటీలు ఏర్పాటు చేశామని ఎస్పీ నరసింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వృద్ధాప్యంలో ఉన్న వారిని ఆదరించడం, వైద్య, ఆహార, వసతి సదుపాయాలు కల్పించడం వారి వారసుల ప్రాథమిక కర్తవ్యమని తెలిపారు. వృద్ధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సీనియర్ సిటిజన్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
దమ్ము చక్రాలతో ట్రాక్టర్లు రోడ్లపైకి రావొద్దు
వ్యవసాయ పనుల నిమిత్తం ఇనుప దమ్ము చక్రాలు అమర్చిన ట్రాక్టర్లను రహదారులపైకి రావొద్దని ఎస్పీ నరసింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పొలం పనుల కోసం ట్రాక్టర్లకు దమ్ము చక్రాలను ఉపయోగించడం సహజమే అయినప్పటికీ, ఆ పనులు పూర్తి కాగానే వాటిని తొలగించి సాధారణ టైర్లతోనే రోడ్లపైకి రావాలని పేర్కొన్నారు. ఇనుప చక్రాల రాపిడి వల్ల తారు రోడ్లు ధ్వంసమవుతున్నాయని, తద్వారా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
సమస్యలు లేకుండా
‘ఆర్టీసీ’ విలీనం జరగాలి
భానుపురి (సూర్యాపేట) : ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రక్రియ జరగాలని ఆర్టీసీ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ ( ఎస్‌డబ్ల్యూఎఫ్–సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి గడ్డం లింగమూర్తి, కోశాధికారి కేఎస్ రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేటలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో రీజియన్ అధ్యక్షుడు కందుల నర్సింహ అధ్యక్షతన ఏర్పాటైన జనరల్ బాడీ సమావేశంలో వారు మాట్లాడారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, ఎస్‌డబ్ల్యూఎఫ్ రీజ యన్ కార్యదర్శి బత్తుల సుధాకర్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రాంబాబు, రీజియన్ సహాయ కార్యదర్శి శ్యాంసుందర్, రీజియన్ కోశాధికారి బైరు శ్రీకాంట్లం, సహాయ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షులు వినయ్ కుమార్, రాములు, వివిధ డిపోల డిపోల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
మట్టపల్లిలో
నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో బుధవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో శ్రీస్వామి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం ఎదుర్కోలు, నిత్య కల్యాణం జరిపి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ చలపతిరావు, అర్చకులు పద్మనాభచార్యులు, కృష్ణమాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
‘సర్’కు సహకరించాలి
తుంగతుర్తి : సర్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీల నాయకులు, ఏజెంట్లు సహకరించాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో తహసీల్దార్ దయానందం, డీటీ కంటమయ్య, సీతయ్య, రాంబాబు, ఎల్లయ్య, సుదర్శన్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాటిన మొక్కలను
సంరక్షించాలి
మోతె : వీబీజీ రామ్‌జీ పథకంలో నాటిన మొక్కలు సంరక్షించాలని జెడ్పీ సీఈఓ శిరీష అన్నారు. వనమహోత్సవంలో భాగంగా బుధవారం మోతె మండల కేంద్రంతోపాటు మామిళ్లగూడెం, రాఘవాపురం గ్రామాలను సందర్శించి మొక్కలు నాటారు. అనంతరం పలు అభివృద్ధి పనులు పరిశీలించి మాట్లాడారు. గ్రామాల్లో నిర్మించే మహిళా సంఘాల భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆమె వెంట ఎంపీడీఓ సందీప్‌కుమార్, మోతె సర్పంచ్ అనురాధ, మామిల్లగూడెం సర్పంచ్ నాగమణి, ఏపీఓ నగేష్, ఈసీ శ్రీహరి, ఉపాధి హామీ సిబ్బంది, కార్యదర్శులు ఉన్నారు.


