భానుపురి (సూర్యాపేట) : రహదారి భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు. రాజస్థాన్, రంగారెడ్డి జిల్లాలో జరిగిన భారీ ప్రమాదాలను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించి జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో రవాణా, రెవెన్యూ, విద్య, వైద్యం, పోలీస్, ఆర్‌అండ్ బీ, పంచాయతీ, నేషనల్ హైవే అధికారులతో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో మాట్లాడారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో డీఆర్‌ఓ ప్రేమ్‌రాజ్, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, ఆర్టీఓ పురుషోత్తంరెడ్డి, డీపీఓ యాదగిరి, ఆర్‌అండ్‌బీ ఈఈ సీతారామయ్య, డీఈఓ అశోక్, మున్సిపల్ కమిషనర్లు, నేషనల్ హైవే అధికారులు, ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు.
‘సర్’ను పారదర్శకంగా నిర్వహించాలి
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను పారదర్శకంగా తప్పుల్లేకుండా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం వీబీజీ రామ్‌జీ పథకంతోపాటు అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా కూలీలందరికీ వీబీజీ రామ్‌జీ పథకం కింద ఉపాధి కల్పించాలని ఆదేశించారు. పలు సూచనలు చేశారు. ఈ సమావేశాల్లో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, వివిధ పార్టీల నాయకులు రాజేశ్వరరావు, ఎం.స్టాలిన్, ఎస్.సత్యనారాయణ, కోట గోపి, బి.రమేష్, జెడ్పీ సీఈఓ శిరీష, డీఆర్‌డీఓ సన్యాసయ్య, డీపీఓ యాదగిరి, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


