అమెరికా సామ్రాజ్యవాద విధానాలను ఎండగట్టాలి
సూర్యాపేట అర్బన్: ఆధిపత్యం పేరుతో అమెరికా సామ్రాజ్యవాదం చేస్తున్న దురాగతాలను ఎండగట్టాలని, ప్రజలను చైతన్యం చేసి పోరాటాలు ఉధృతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్ పిలుపునిచ్చారు. రెడ్ బుక్ డే సందర్భంగా శనివారం సూర్యాపేటలో సీపీఎం జిల్లా కార్యాలయంలో ‘బరితెగించిన అమెరికా సామ్రాజ్యవాదం’ పుస్తకాన్ని సామూహిక పఠనం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా దోపిడీని కొనసాగించేందుకు అమెరికా అంతర్జాతీయ మానవ హక్కులను, న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తుందన్నారు. గతంలో ఇజ్రాయిల్‌ను ప్రోత్సహించి పాలస్తీనాపై దాడులు చేసి మానవ హననం చేసిందన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


