వారం రోజులే గడువు | - | Sakshi
Sakshi News home page

వారం రోజులే గడువు

Feb 21 2026 6:50 AM | Updated on Feb 21 2026 6:50 AM

వారం రోజులే గడువు

వారం రోజులే గడువు

ప్రత్యేక శిబిరాలు

భానుపురి (సూర్యాపేట) : ఫార్మర్‌ రిజిస్ట్రీకి మరో వారం రోజులే మిగిలి ఉంది. ప్రతి రైతుకు గుర్తింపు సంఖ్యతో కూడిన కార్డులను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్‌ రిజిసీ్ట్ర ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఇందుకోసం ఎలాంటి గడువు విధించకపోవడంతో రైతులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దాంతో ఈ ప్రక్రియ నత్తనడకన సాగింది. కానీ ప్రస్తుతం రైతుల గుర్తింపును ఈ నెల 28తో ముగించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడంతో అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు.

కేంద్ర పథకాలకు గుర్తింపు తప్పనిసరి

కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న వ్యవసాయ పథకాల లబ్ధికి ఫార్మర్‌ రిజిస్ట్రీ తప్పనిసరి చేసింది. నమోదుకు కూడా ఈ నెలాఖరు వరకే చివరి గడువుగా విధించింది. ఈ లోగా తమ పేర్లను నమోదు చేసుకోని రైతులకు ఇకపై కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలకు అర్హులుగా గుర్తించదు. జిలా రైతులు నష్టపోకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక శిబిరాలతో ఈ ప్రక్రియను వేగవంతం చేశారు.

ప్రారంభంలో రైతుల అనాసక్తి

వ్యవసాయ రంగంలో రైతుల వివరాలను డిజిటల్‌ రూపంలో నమోదు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫార్మర్‌ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో నమోదు చేసుకున్న రైతులకు ఆధార్‌ కార్డులాగా 11 అంకెలతో కూడిన ఐడీని అందించనుంది. ఈ ప్రక్రియను జిల్లాలో 2025 మే 5న జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ప్రారంభించారు. ఈ సమయంలో వ్యవసాయ పనులు లేకపోవడంతో నెలరోజుల్లో 28.93 శాతం నమోదు చేసుకున్నారు. ఆ తరువాత వానాకాలం సీజన్‌ వ్యవసాయ పనులు మొదలు కావడంతో ఈ ప్రక్రియ అంతంత మాత్రంగానే కొనసాగుతూ వస్తోంది.

మండలాల వారీగా నమోదు వివరాలు

మండలం మొత్తం నమోదు శాతం

రైతులు చేసుకున్నవారు

అనంతగిరి 11,576 7127 61.57

ఆత్మకూర్‌ (ఎస్‌) 17,689 10,716 60.58

చిలుకూరు 12,820 7000 54.60

చింతలపాలెం 9759 6314 64.70

చివ్వెంల 15,8777 9,993 62.94

గరిడేపల్లి 19,807 11,329 57.20

హుజూర్‌నగర్‌ 12,372 6646 53.72

జాజిరెడ్డిగూడెం 10,630 7308 68.75

కోదాడ 16,271 10,040 61.70

మద్దిరాల 9,286 5209 56.10

మఠంపల్లి 13,456 7930 58.93

మేళ్లచెర్వు 11,367 6189 54.45

మోతె 14,455 9068 62.73

మునగాల 12,980 7893 60.81

నడిగూడెం 11,005 6810 61.88

నాగారం 11,103 6890 62.06

నేరేడుచర్ల 13,055 8122 62.21

నూతనకల్‌ 9,614 6650 69.17

పాలకీడు 8,947 5682 63.51

పెన్‌పహాడ్‌ 16,670 9670 58.01

సూర్యాపేట 19,082 10957 57.42

తిరుమలగిరి 11,869 6861 57.81

తుంగతుర్తి 12,873 7878 61.20

3,02,563 1,82,282 60.25

వ్యవసాయ శాఖ అధికారులతో పాటు రెవెన్యూ, మండల పరిషత్‌, సహకార సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామంలో ఫార్మర్‌ రిజిస్ట్రీ చేపట్టనున్నట్లు ముందుగానే ప్రచారం చేసి ఆయా శాఖల అధికారులు క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 100 శాతం ఫార్మర్‌ రిజిస్ట్రీ పూర్తి చేయాలంటూ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అధికారులను ఆదేశించడంతో మూడు రోజులుగా ప్రక్రియ వేగవంతమైంది. ఈ ప్రక్రియ ఇప్పటి వరకు 60.25 శాతానికి చేరుకుంది. జిల్లావ్యాప్తంగా 3,02,563 మంది పాస్‌ పుస్తకాలు కలిగిన రైతులు ఉండగా.. 1,82,282 మంది రైతులు రిజిస్ట్రీ చేసుకున్నారు. నూతనకల్‌ 69.17 శాతంతో మొదటి స్థానంలో, 53.72 శాతంతో హుజూర్‌నగర్‌ మండలం చివరి స్థానంలో ఉంది.

ఫ ఈ నెల 28తో ముగియనున్న ఫార్మర్‌ రిజిస్ట్రీ గడువు

ఫ ఇప్పటి వరకు 60.25 శాతం నమోదు

ఫ గ్రామాలల్లో ప్రత్యేక

క్యాంపుల ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement