అయ్యయ్యో.. | - | Sakshi
Sakshi News home page

అయ్యయ్యో..

Feb 21 2026 6:50 AM | Updated on Feb 21 2026 6:50 AM

అయ్యయ

అయ్యయ్యో..

గెలిచిన వారి పరిస్థితి కూడా అంతే

సూర్యాపేట అర్బన్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థుల కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఎన్నికల్లో పోటీ కోసం చేసిన ఖర్చు ప్రస్తుతం భారంగా మారింది. తాము గెలుస్తామనే ఆశతో అందిన కాడికి అప్పులు తెచ్చిన అభ్యర్థులు ఇప్పుడు వాటిని తీర్చేదెలా అంటూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఆస్తులు విక్రయించి మరీ..

సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో ఒక్కో వార్డులో ముగ్గురు నుంచి నలుగురు అభ్యర్థులు పోటీ చేశారు. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా రావడంతో గెలుస్తామనే ఆశతో తాహతుకు మించి ఖర్చుపెట్టినా ఫలితం లేకపోవడంతో ఓడిన అభ్యర్థులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. చాలా మంది ఎన్నికల ఖర్చు కోసం పొలాలు, ప్లాట్లు, ఇల్లు, బంగారం కుదువ పెట్టి అప్పులు తీసుకున్నారు. మరికొందరైతే ఏకంగా ఆస్తులను అమ్మి డబ్బులు తీసుకున్నారు. రూ.50 లక్షలకు పైగా విలువ ఉన్న ప్లాట్లను, పొలాలను కేవలం రూ. 20 నుంచి 30 లక్షలకే అమ్ముకున్నట్లు కొందరు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరు తమకు నమ్మకం ఉన్నచోట, బంధువుల నుంచి లక్షల్లో అప్పులు తెచ్చి ఖర్చు పెట్టారు. తీరా ఫలితాలు విరుద్ధంగా రావడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.

612 మంది పోటీ

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో ఉన్న 141 వార్డుల్లో 612 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఇందులో సూర్యాపేటలోని 48 వార్డుల్లో 264 మంది, కోదాడలోని 35 వార్డుల్లో 127 మంది, హుజూర్‌నగర్‌లోని 28 వార్డుల్లో 111 మంది, తిరుమలగిరిలోని 15 వార్డుల్లో 56 మంది, నేరేడుచర్లలోని 15 వార్డుల్లో 54 మంది అభ్యర్థులు వివిధ పార్టీల తరఫున పోటీ చేశారు.

పోటాపోటీగా ఖర్చు

సూర్యాపేట మున్సిపాలిటీతో పాటు మిగతా మున్సిపాలిటీలలో కూడా అభ్యర్థులు పోటీపడి మరీ భారీ ఎత్తున ఖర్చు పెట్టారు. పట్టణాలకు దగ్గరగా ఉన్న వార్డులు, రాజకీయంగా పలుకబడి ఉన్న వారు పట్టణాల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో పోటాపోటీగా ఖర్చు చేశారు. చాలామంది అభ్యర్థులు రూ. 50 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకు ఖర్చ చేయగా మరికొందరు రూ. కోటికి పైగా ఖర్చు చేసి ఓడిపోయారు. లక్షల రూపాయలు ఖర్చుపెట్టినా గెలవకపోవడంతో ఓడిపోయిన అభ్యర్థులు, వారి కుటుంబాలు ఇంకా షాక్‌ నుంచి కోలుకోలేక పోతున్నారు. చివరకు బంధువులు ధైర్యం చెబుతూ ఓదారుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.

భారీగా ఖర్చుపెట్టి గెలిచిన మున్సిపల్‌ వార్డు కౌన్సిలర్ల పరిస్థితి కూడా దయనీయంగానే ఉంది. పోటీ అధికంగా ఉన్న వార్డుల్లో రూ.50 లక్షల నుంచి కోటి వరకు ఖర్చు పెట్టారు. లక్షలు పెట్టి గెలిచాం ఇప్పుడు అప్పులు ఎలా తీర్చాలి అంటూ వారు తల పట్టుకుంటున్నారు.

ఫ ఇంకా షాక్‌లోనే ఓడిన అభ్యర్థులు

ఫ ఒక్కొక్కరు.. రూ.50 లక్షల నుంచి

60 లక్షలకు పైగా ఖర్చు

ఫ గెలుస్తామనే ఆశతో భూములు, ప్లాట్లు, బంగారం తాకట్టు

అయ్యయ్యో..1
1/1

అయ్యయ్యో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement