ఎడ్ల పందేల విజేత హుజూర్‌నగర్‌ | - | Sakshi
Sakshi News home page

ఎడ్ల పందేల విజేత హుజూర్‌నగర్‌

Feb 21 2026 6:50 AM | Updated on Feb 21 2026 6:50 AM

ఎడ్ల

ఎడ్ల పందేల విజేత హుజూర్‌నగర్‌

మేళ్లచెరువు : మండల కేంద్రంలోని ఇష్టకామేశ్వరీ సమేత స్వయంభు శంభులింగేశ్వర స్వామి కల్యాణోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన జాతీయస్థాయి ఎడ్ల పందేలు గురువారం రాత్రి ముగిసాయి. ఈ పందేల్లో హుజూర్‌నగర్‌కు చెందిన సుంకి సురేందర్‌రెడ్డికి చెందిన ఎద్దుల జత 25 క్వింటాళ్ల బండను 25 నిమిషాల్లో 2,533 అడుగుల దూరం లాగి మొదటి బహుమతిగా ట్రాక్టర్‌ను గెలుచుకున్నాయి. కడప జిల్లాకు చెందిన పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామానికి చెందిన శివకృష్ణ యాదవ్‌కు చెందిన గిత్తలు 25 క్వింటాళ్ల బరువును 2,250 అడుగల దూరం లాగి ద్వితీయ బహుమతిగా రూ.1.50 లక్షలు గెలుచుకున్నాయి.

మట్టపల్లి ఆలయంలో విశేషపూజలు

మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం లక్ష్మీనరసింహస్వామికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, పంచామృతాభిషేకం చేపట్టారు. లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లలను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవారి నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్‌, ఈఓ బి.జ్యోతి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

సైన్స్‌తోనే

నూతన ఆవిష్కరణలు

హుజూర్‌నగర్‌ : నూతన ఆవిష్కరణలో సైన్స్‌ పాత్ర గొప్పదని కళాశాల విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి. బాల భాస్కర్‌ అన్నారు. గురువారం హుజూర్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘మాలిక్యులార్‌ డాకింగ్‌’ అంశంపై ఒక రోజు జాతీయ వర్క్‌షాప్‌ నిర్వహించారు. కార్యక్రమాన్ని విద్యాశాఖ జేడీ ప్రారంభించి మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులలో పరిశోధన, పరిశీలన, నూతన ఆవిష్కరణలపై అవగాహన ఏర్పడుతుందన్నారు. తాను పుట్టి పెరిగిన ప్రాంతానికి గెస్ట్‌గా రావడం సంతోషంగా ఉందని, కళాశాలలోని పేద విద్యార్థులకు సా యం అందిస్తానని, కళాశాల అభివృద్ధికి సహకరిస్తానని అన్నారు. సమావేశంలో హుజూర్‌నగర్‌, కోదాడ డిగ్రీ కళాశాలల ప్రిన్సి పాల్స్‌ ఎస్‌. రామారావు, డాక్టర్‌ జి హాదసరాణి, కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎస్‌. సునంద, కన్వీనర్‌ ఎస్‌. ప్రియాంక, రిసోర్స్‌ పర్సన్‌ డాక్టర్‌ యు. పురుషోత్తం, అధ్యాపకులు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌, మహారాష్ట్రకు చెందిన రీసెర్చ్‌ స్కాలర్స్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

పోస్టల్‌ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

నడిగూడెం : పోస్టల్‌ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పోస్టల్‌ బ్యాంకు మేనేజర్‌ లక్ష్మణ్‌ కోరారు. శుక్రవారం నడిగూడెం పోస్టాఫీస్‌ వద్ద నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యక్తిగత బీమా, ప్రమాద బీమా, పలు పథకాలపై అవగాహన కల్పించారు. స్థానిక పోస్టు మాస్టర్‌ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎడ్ల పందేల విజేత హుజూర్‌నగర్‌1
1/3

ఎడ్ల పందేల విజేత హుజూర్‌నగర్‌

ఎడ్ల పందేల విజేత హుజూర్‌నగర్‌2
2/3

ఎడ్ల పందేల విజేత హుజూర్‌నగర్‌

ఎడ్ల పందేల విజేత హుజూర్‌నగర్‌3
3/3

ఎడ్ల పందేల విజేత హుజూర్‌నగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement