ప్రత్యేక బృందాలతో పరీక్షల పర్యవేక్షణ
ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లాలో మొత్తం 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రతి కేంద్రంలో 8 నుంచి 10 సీసీ కెమెరాలు ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం. పరీక్షలను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రతి సెంటర్‌కు సీఎస్, డీఓలతో పాటు జిల్లాలో రెండు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు, రెండు ఫ్‌లైయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించాం. దాంతో పాటు ప్రిన్సిపల్, లెక్చరర్‌తో కూడిన ఎగ్జామినేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేశాం. వీరు పరీక్షల తీరును నిరంతరం పర్యవేక్షిస్తారు. జిల్లా కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్ చైర్మన్‌గా, ఎస్పీ నరసింహ కో చైర్మన్‌గా, ఎ.గోపాల్ ఎక్స్‌అఫిషియో మెంబర్‌గా, డీఐఈవో భానునాయక్ మెంబర్‌గా ఉన్న హైపర్ కమిటీ కూడా పరీక్షలను పర్యవేక్షిస్తుంది. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
16178 మంది విద్యార్థులు
జిల్లాలో మొత్తం 86 ప్రభుత్వ, ప్రైవేట్ జూని యర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 16178 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో మొదటి సంత్సరం జనరల్ విభాగంలో 6,609 మంది, ఒకేషనల్ విభాగంలో 1579 మంది ఉన్నారు. అలాగే ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 6,479 మంది, ఒకేషనల్ విభాగంలో 1511 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్నాయి.
మెరుగైన ఫలితాలు సాధించేలా..
గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించి విద్యార్థులను సిద్ధం చేశాం. ఈ విద్యా సంవత్సరం మూడు సా ర్లు తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాం. పిల్లల ప్రగతిపై వారికి వివరించాం. గ్రామీణ ప్రాంత విద్యార్థులు సత్ఫలితాలు సాధించేలా దిశానిర్దేశం చేశాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాం.
సూర్యాపేటటౌన్ : ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, సీసీ కెమెరాలు ఉండే సెంటర్‌లను ఎంపిక చేశామని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి(డీఐఈఓ) భానునాయక్ తెలిపారు. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ ఏడాది ఒక్క నిమిషం నిబంధన లేదని, ఐదు నిమిషాల్లోపు వచ్చిన వారికి కూడా అనుమతి ఉంటుందని వెల్లడించారు. శుక్రవారం డీఐఈఓ సాక్షి ఇంటర్వ్యూలో వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే..
విద్యార్థులకు సంబంధించిన హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో ఉంచాం. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు విద్యార్థులు ఫీజులు చెల్లించలేదని హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తే నేరుగా ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో ప్రథమ సంవత్సరం విద్యార్థులు పదో తరగతి హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ, సెకండ్ ఇయర్ విద్యార్థులు మొదటి సంవత్సరం హాల్‌టికెట్, పుట్టిన తేదీ నమోదు చేసి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఫ ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధన ఎత్తివేత
ఫ ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతి
ఫ సీసీ కెమెరాలతో నిఘా
ఫ డీఐఈఓ భానునాయక్
ప్రత్యేక బృందాలతో పరీక్షల పర్యవేక్షణ


