సన్నాల బోనస్‌ రూ.43.19 కోట్లు | - | Sakshi
Sakshi News home page

సన్నాల బోనస్‌ రూ.43.19 కోట్లు

Feb 17 2026 7:44 AM | Updated on Feb 17 2026 7:44 AM

సన్నాల బోనస్‌ రూ.43.19 కోట్లు

సన్నాల బోనస్‌ రూ.43.19 కోట్లు

భానుపురి (సూర్యాపేట) : వానాకాలం సీజన్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన సన్నరకం ధాన్యానికి ఇవ్వాల్సిన బోనస్‌ నిధులను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఇందులోంచి జిల్లాకు చెందిన రైతులకు రూ.43.19 కోట్లు అందాయి. ఈ నిధులు నేరుగా రైతుల అకౌంట్లలో జమ అయ్యాయి. దాంతో ఇప్పటి వరకు రూ.116.67 కోట్ల బోనస్‌ చెల్లింపులు పూర్తయ్యాయి. బోనస్‌ కోసం రెండు నెలలుగా ఎదురు చూస్తున్న రైతులు నిధుల విడుదలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విడతల వారీగా..

వానాకాలం సీజన్‌లో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 49,100 మంది రైతుల నుంచి 2,36,830 మెట్రిక్‌ టన్నుల సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి ప్రభుత్వం సేకరించింది. రెండేళ్లుగా సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు రూ.500 చొప్పున బోనస్‌ చెల్లిస్తోంది. బోనస్‌ కారణంగా సన్నరకం ధాన్యం సాగు రెట్టింపయ్యింది. గతంలో 50 నుంచి 60 వేల మెట్రిక్‌ టన్నుల సన్నధాన్యం పండగా.. ఈ వానాకాలం సీజన్‌లో కొనుగోలు కేంద్రాలకే 2,36,830 మెట్రిక్‌ టన్నులు వచ్చింది. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు రూ.118.41 కోట్ల బోనస్‌ చెల్లించాల్సి ఉంది. అయితే మద్దతు ధరతో కాకుండా ప్రత్యేకంగా రైతులకు బోనస్‌ను ఇస్తోంది. ఈ క్రమంలో జిల్లాలో ఇప్పటి వరకు మూడు విడతల్లో సుమారు రూ.116.67 కోట్లను అందించింది.

రూ.1.72 కోట్లు పెండింగ్‌

రైతుల నుంచి ధాన్యం సేకరించిన నాటి చి రెండు విడతల్లో రూ.73 కోట్ల నిధులను ప్రభుత్వం జమ చేసింది. తర్వాత నెలరోజులుగా ఎలాంటి నిధులను జమ చేయకపోవడంతో రైతులు పంటల సాగుకు పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు రూ.43.19 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులతో కలిపి జిల్లా రైతాంగానికి మొత్తం రూ.116.67 కోట్లు ఇవ్వగా.. ఇంకా రూ.1.72 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయి.

రైతుల అకౌంట్‌లో

ధాన్యం బోనస్‌ డబ్బులు

ఫ మూడు విడతల్లో కలిపి

రూ.116.67 కోట్లు చెల్లింపు

ఫ పెండింగ్‌లో మరో రూ.1.72 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement