15 సెకన్‌లలో యూరియా నిల్వలు ఖాళీ
పెన్‌పహాడ్ : మండలంలోని అనంతారం గ్రామంలోని నారాయణగూడెం పీఏసీఎస్ కార్యాలయానికి 444 బస్తాల యూరియా రావడంతో సిబ్బంది సోమవారం యాప్‌లో అప్‌లోడ్ చేశారు. సమయం ప్రారంభమైన 15 సెకన్‌లలోనే 125 మంది రైతులు యూరియా బస్తాలను బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత యాప్‌లో నిల్వలు అయిపోయినట్లు మెసేజ్ వస్తుండడంతో అక్కడికి వచ్చిన రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా యాప్‌ను రద్దు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ లాలు అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. యాప్‌లో బుక్ చేసుకున్న రైతులకు యూరియాను అందిస్తామని. మిగతా రైతులు నిల్వలు రాగానే యాప్‌లో బుక్ చేసుకోవాలని రైతులను సముదాయించడంతో వారు శాంతించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి అనిల్‌కుమార్, సీఈఓ ఆలయకుంట్ల సైదులు, సిబ్బంది ఉన్నారు.
ఫ పీఏసీఎస్ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన


