న్యాయవాదుల ఆందోళన
చివ్వెంల : హైదరాబాద్‌లో న్యాయవాది మహ్మద్ ఖదీర్ హత్యను నిరసిస్తూ సోమవారం సూర్యాపేట బార్ అసోసియేసన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి కోర్టు ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టి అమలు చేయాలని, న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, తలమల్ల హస్సెన్, అల్లంనేని వెంకటేశ్వర్‌రావు, మంతసురం కిశోర్, అనుములపురి సైదులు, కుంచం చంద్రకాంత్, మచ్చగోపి, ధరావతు వీరేశ్‌నాయక్, బొడ్డు అనిల్‌కుమార్, మీసాల శ్రీనివాస్, జటంగి శ్రీనాథ్ యాదవ్ పాల్గొన్నారు.


