మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి
భువనగిరి: పట్టణ శివారులోని మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిన బాలఆకాష్ ఆదివారం తోటి విద్యార్థితో కలిసి పాఠశాల సమీపంలోని ఫాంపాండ్‌లో ఈతకు వెళ్లి నీట మునిగి మృతిచెందాడు. నకిరేకల్ నియోజకవర్గంలోని కేతేపల్లి మండలానికి చెందిన బాలఆకాష్ మృతదేహాన్ని భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా చిరుమర్తి మాట్లాడుతూ.. విద్యార్థి మృతికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి రూ.2కోట్లు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా బాలఆకాష్ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ధర్నాలో బీఆర్‌ఎస్ నాయకులు అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


