కాంగ్రెస్‌తో బీజేపీ చేతులు కలిపింది | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తో బీజేపీ చేతులు కలిపింది

Feb 17 2026 7:17 AM | Updated on Feb 17 2026 7:17 AM

కాంగ్రెస్‌తో బీజేపీ చేతులు కలిపింది

కాంగ్రెస్‌తో బీజేపీ చేతులు కలిపింది

మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శ

తిరుమలగిరి(తుంగతుర్తి) : బీజేపీ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి భయపడుతోందని, అందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో బీజేపీ చేతులు కలిపిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన తిరుమలగిరిలో మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికై న సంకెపల్లి రఘునందన్‌రెడ్డిని, నూతన కౌన్సిలర్లను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర పోషించిందని, ఎన్నికల సంఘం కాంగ్రెస్‌కు బి టీమ్‌గా వ్యవహరిస్తుందని ఆరోపించారు. అధికార పార్టీ మున్సిపాలిటీలను చేజిక్కించుకోవడానికి కౌన్సిలర్లను కిడ్నాప్‌ చేశారని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ పార్టీదే విజయమని అన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి దోపిడీలు చూడలేదన్నారు. ఆయన వెంట తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ ఉన్నారు.

ఏడుగురిపై కేసు నమోదు

భువనగిరి: పట్టణంలోని 1వ వార్డు అర్బన్‌ కాలనీలో తమకు ఓటు వేయలేదని ఓటర్లను దూషిస్తున్న వారిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సోమవారం ఏడుగురిపై కేసు నమోదు చేశారు. రెండో వార్డు కౌన్సిలర్‌ పోలిశెట్టి అనిల్‌కుమార్‌తో పాటు పోలిశెట్టి ఫౌండేషన్‌ సభ్యులు అభినయ్‌, మిట్లు, బాలు, రియాజ్‌, ఫయాజ్‌, జావిద్‌పై కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement