కాంగ్రెస్‌దే ఘన విజయం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌దే ఘన విజయం

Feb 12 2026 11:31 AM | Updated on Feb 12 2026 11:31 AM

కాంగ్రెస్‌దే  ఘన విజయం

కాంగ్రెస్‌దే ఘన విజయం

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కోదాడ : మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించబోతున్నదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం కోదాడ మున్సిపాలిటీలోని 14వ వార్డు పరిధిలో ఓటు వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. సామాన్యులకు సన్న బియ్యం అందిచండంతో పాటు మహిళలకు ఉచిత బస్‌ సౌకర్యం కల్పించిందన్నారు. అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హమీలను 100శాతం అమలు చేస్తుందని అన్నారు.

1994 నుంచి..

మంత్రి ఉత్తమ్‌ 1994లో కోదాడ ఎమ్మెల్యేగా పోటీచేసిన సమయంలో ఉత్తమ్‌ దంపతులు కోదాడలోని నయానగర్‌లో కాంగ్రెస్‌ నాయకుడు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి ఇంట్లో ఉండేవారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో వారు ఇక్కడి నుంచే తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement