కోతులను పట్టించారు
కొలువుదీరిన వనదేవతలు
రాజాపేట మండలం చిన్నమేడారం, చల్లూరులో సమ్మక–సారలమ్మ దేవతలు గద్దెలపై కొలువుదీరారు.
మాట ఇచ్చారు..
- 8లో
కాసర్లపహాడ్‌కు చెందిన మంచాల లలిత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా బరిలోకి దిగారు. ప్రచారంలో భాగంగా ఏ వీధికి వెళ్లినా.. ప్రజలు కోతుల సమస్యను ఏకరువు పెట్టారు. మీ సమస్య తీరుస్తానంటూ వారికి హామీ ఇచ్చాడు. ఆమెను ప్రజలు మంచి మెజార్టీతో గెలిపించి సర్పంచ్ పగ్గాలు అప్పగించారు. ఇచ్చిన మాట ప్రకారం కోతులను పట్టించి తరలించారు. సమస్య తీరడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అర్వపల్లి: పంచాయతీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు పలువురు సర్పంచ్‌లు నడుం బిగించారు. ఏది నెరవేర్చినా నెరవేర్చకపోయినా కోతుల బెడద నుంచి తప్పించే పనిలో ఉన్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో కోతుల పట్టివేత పూర్తి కాగా మరికొన్ని చోట్ల కొనసాగుతోంది. పట్టిన కోతులను అడవుల్లో వదులుతున్నారు.
● జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామంలో డీసీసీ ఉపాధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది దరూ రి యోగానందచారి ఆర్థిక సహకారంతో సర్పంచ్ కుంటిగొర్ల శ్రీనివాస్ కోతులను పట్టిస్తున్నాడు. ఇప్పటికే సుమారు 3,800 కోతులను పట్టించి శ్రీశైలం అడవులకు తీసుకెళ్లి వదిలేశారు. ఏటా జూన్‌లో కోతులు పట్టించాలని నిర్ణయించారు.
● జాజిరెడ్డిగూడెంలో సర్పంచ్ బింగి కృష్ణమూర్తి సొంత ఖర్చులతో కోతులను పట్టించి ఇల్లందు అడవులకు తరలిస్తున్నాడు. ఇక్కడ ఇప్పటి వరకు 500 వరకు కోతులను పట్టి తరలించారు.
● కాసర్లపహాడ్‌లో సర్పంచ్ మంచాల లలితరాంమ్మూర్తి గ్రామస్తుల సహకారంతో వానరాల పని పడుతున్నారు. ఇప్పటి వరకు 300కు పైగా కోతులను పట్టి ఇల్లందు అడవులకు తరలించారు.
● అర్వపల్లిలో గ్రామస్తుల సహకారంతో కోతుల పట్టివేతకు సర్పంచ్ చిల్లంచర్ల విద్యాసాగర్ సన్నాహాలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక బృందాలు
ప్రస్తుతం జిల్లాలోని వివిధ పంచాయతీల్లో కోతుల పట్టివేత కార్యక్రమం కొనసాగుతోంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, రాజమండ్రి, గుంటూరు ప్రాంతాల నుంచి ప్రత్యేక బృందాలను రప్పించారు. వీరికి ఒక్కో కోతిని పట్టినందుకు గాను రూ.300 చొప్పున చెల్లిస్తున్నారు. ఈ బృందాలు ప్రత్యేకంగా బోన్లను ఏర్పాటు చేసి వానరాలను బందిస్తున్నాయి.


