బాధితుని వద్దకే వెళ్లి ఎఫ్‌ఐఆర్
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : ఆత్మకూర్ పోలీసులు బాధితుడి వద్దకే వెళ్లి కేసు నమోదు చేశారు. అక్కడికక్కడే ఎఫ్‌ఐఆర్ కాపీ అందజేశారు. ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాలిలా.. ఆత్మకూర్(ఎస్) మండలం పాత సూర్యాపేటకు చెందిన తండు మహేష్ కల్లుగీత కార్మికుడు. వృత్తిలో భాగంగా మహేష్ ఇటీవల కల్లు గీసుకొని బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. పాత సూర్యాపేట స్టేజీ వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు అతన్ని ఆపి పేరు అడిగాడు. అంతేకాకుండా మహేష్‌పై అకారణంగా దాడి చేశారు. సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా సిటిజన్ సెంట్రిక్ అప్రోచ్ సమాచారం మేరకు ఆత్మకూర్ ఎస్‌ఐ బత్తిని శ్రీకాంత్ అక్కడికి వెళ్లి విచారణ చేశారు. బాధితుని నుంచి దరఖాస్తు తీసుకొని అక్కడే కేసు నమోదు చేయడంతో పాటు మహేష్‌కు ఎఫ్‌ఐఆర్ కాపీ అందజేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


