తాటాకు చప్పుళ్లకు భయపడేవారు లేరు
కోదాడ: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను అభాసుపాలు చేయడానికి రాష్ట్ర ముఖ్య మంత్రి ప్రయత్నిస్తున్నారని, పోలీసులను ఉపయోగించుకొని చేస్తున్న కుట్రలను తెలంగాణ సమాజం గమనిస్తుందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ తాటాకు చప్పులకు భయపడేవారు ఎవ్వరూ లేరన్నారు. కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ గురువారం కోదాడ బస్టాండ్ సెంటర్‌లో గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తన ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, అటువంటి గొప్ప వ్యక్తికి నోటీసులు ఇవ్వడం ప్రభుత్వానికి తగదన్నారు. కాంగ్రెస్ సర్కార్ దుశ్చర్యలను తెలంగాణ సమాజం గమనిస్తుందని, తగిన విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉందన్నారు. కేసీఆర్‌ను విచారణకు పిలిస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ఎస్‌కే నయీం, సుంకర అజయ్‌కుమార్, సురేష్‌నాయుడు, నూనె నాగన్న, పిట్టల బాగ్యమ్మ, కర్ల సుందర్‌బాబు, చింతల నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఉద్రిక్తత...
ఈ నెల 24న పోలీస్ యాక్ట్–30 అమల్లో ఉండగా ప్రదర్శన నిర్వహించడంతో బొల్లం మల్లయ్యపై కోదాడ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై పోలీసులు ఆయనకు నోటీసులు అందించారు. నోటీసులకు సమాధానం ఇవ్వడానికి గురువారం సాయంత్రం మల్లయ్య తన అనుచరులతో స్టేషన్‌కు రాగా పోలీసులుఅడ్డుకున్నారు. దీంతో లోనికి చొచ్చుకొని వచ్చిన మల్లయ్య సీఐతో వాగ్వాదానికి దిగాడు. పోలీసులు అధికారపార్టీకి వత్తాసు పలుకుతూ బీఆర్‌ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. డీఎస్పీ వచ్చి సర్దిచెప్పి మల్లయ్యయాదవ్‌ను బయటకి పంపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ప్రదర్శన నిర్వహించడంతో పాటు అనుచరులతో స్టేషన్ రావడాన్ని పోలీసులు సీరి యస్‌గా పరిగణిస్తున్నారని, మరోసారి కేసు నమోదు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఫ కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్


