గ్రామసభలు నిర్వహించండి
భానుపురి (సూర్యాపేట) : భూములను రీ సర్వే చేసేందుకు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఆర్డీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం, జాజిరెడ్డిగూడెం, హుజూర్‌గర్ మండలం లక్కవరం గ్రామాల్లో ఈ నెల 31న, అనంతగిరి మండలం గొండ్రియాల, గరిడేపల్లి మండలం లక్కవరం, సూర్యాపేట మండలం యండ్లపల్లిలో ఫిబ్రవరి 3న గ్రామ సభలు నిర్వహించి భూము రీసర్వేపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. రెవెన్యూ గ్రామాల పరిధిలోని సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భూములు ఉన్న రైతులు తప్పక పాల్గొనాలని కోరారు. భూ భారతి పెండింగ్ దరఖాస్తులను, ప్రజావాణి ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలని, కోర్టుకేసులకు సంబంధించి భూ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఆర్‌డీఓ పీడీ శిరీష, ఏడీఎస్ ఎల్‌ఆర్ శ్రీనివాసరెడ్డి, ఏఓ సుదర్శన్‌రెడ్డి, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా గన్నా ఉపేందర్
చిలుకూరు: కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన ప్రియాంకాగాంధీ సంగతమ్ ఆలిండియా రాష్ట్ర అధ్యక్షుడిగా చిలుకూరు మండలం సీతారాంపురానికి చెందిన గన్నా ఉపేందర్ నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రియాంకాగాంధీ సంగతమ్ ఆలిండియా జాతీయ అధ్యక్షుడు మాస్ పాషా గురువారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతితో పాటు పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. గన్నా ఉపేందర్‌కు పలువురు నాయకులు అభినందనలు తెలిపారు.
ఆత్మకూర్(ఎస్)లో
ఒడిశా, జార్ఖండ్ బృందం
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధుల బృందం గురువారం ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో పర్యటించింది. ఈ సందర్భంగా ఎంవీ ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులతో సమావేశం అయ్యారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఎంవీ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలను తెలుసుకున్నారు. ఫౌండేషన్‌కు సీఆర్పీఎఫ్, చైల్డ్ ప్రొటెక్షన్ ఫోరం, మదర్స్ కమిటీ, యూత్, కేవీఎస్ కమిటీలు సహకారం అందించిన తీరుపై అధ్యయనం చేశారు. ఎంవీ ఫౌండేషన్ కార్యక్రమాలు బాగున్నాయని కితాబునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ములకలపల్లి కాటయ్య, డేగల వెంకటకృష్ణయ్య, నాగయ్య, జానయ్య, సైదులు, అంజయ్య, రిటైర్డ్ టీచర్లు వీరారెడ్డి, రంగాచారి, మదర్స్ కమిటీ నాగలక్ష్మి, కళావతి, నాగమ్మ, కేవీఎస్ కమిటీ సభ్యురాలు శ్రీజ, ఎంవీ ఫౌండేషన్ మండల ఇంచార్జ్ వత్సవాయి లలిత, నాయిని సైదులు, జయలలిత, మంజుల తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ తీగలు సరిచేయాలని నిరసన
చిలుకూరు: మండల కేంద్రంలోని తేర్లబండ వద్ద పొలాల్లో చేతికందే ఎత్తులో వేలాడుతున్న కరెంట్ తీగలతో ప్రమాదం పొంచి ఉంది. సరి చేయాలని రైతులు పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో గురువారం తీగల వద్ద నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ తీగలు రెండేళ్లుగా కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. ఫిర్యాదు చేసిన ప్రతీసారి అధికారులు వచ్చి చూసి వెళ్తున్నారే తప్ప.. సమస్య పరిష్కరించడం లేదన్నారు. వర్షాకాలం, ఈదురుగాలులు సంభవిస్తే ప్రమా దాలు జరిగే అవకాశం ఉందన్నారు. అధికారులు తక్షణమే స్పందించి తీగలను సరి చేయాలని రైతులు కోరారు.
గ్రామసభలు నిర్వహించండి
గ్రామసభలు నిర్వహించండి


