మొదటి రోజు 24
మున్సిపాలిటీల వారీగా నామినేషన్లు ఇలా..
సూర్యాపేట అర్బన్ : మున్సిపల్ పోరులో తొలి అంకానికి తెరలేసింది. బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించారు. మొదటి రోజు మొత్తం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉదయం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ తరువాత వెంటనే నామినేషన్ల స్వీకరణ మొదలైంది.
రెండు రోజులే గడువు
నామినేషన్లకు ఎన్నికల సంఘం ఎక్కువ సమయం ఇవ్వలేదు. మూడు రోజులు మాత్రమే కేటాయించింది. 30వ తేదీ సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది. అయితే షెడ్యూల్ తర్వాత నామినేషన్ల ప్రక్రియకు నోటిఫికేషన్ ఆలస్యంగా విడుదల చేస్తారని రాజకీయ పార్టీలు భావించాయి. కానీ, వెంటనే నోటిఫికేషన్ రావడంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు సర్దుకునే సమయం లేకుండాపోయింది. ఏ రాజకీయ పార్టీ కూడా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ఖరారు చేయలేదు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. అయితే కొన్ని వార్డుల్లో పోటీ తీవ్రంగా ఉండటంతో అభ్యర్థుల ఎంపిక జాప్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
ధ్రువపత్రాల కోసం అభ్యర్థుల హడావుడి
నామినేషన్ల ప్రక్రియ మొదటి రోజు మందకొడిగా సాగింది. నామినేషన్లు దాఖలు చేయడానికి ఆశావహులు అంతగా ఆసక్తి చూపలేదు. ఇంకా రెండు రోజులు గడువుండటంతో పాటు నామినేషన్ దాఖలుకు కావాల్సిన డాక్యుమెంట్లను సమకూర్చుకోవడం తదితర అంశాలపైనే అభ్యర్థులు దృష్టి పెట్టారు. దీంతో బ్యాంకులు, మున్సిపల్ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది.
హెల్ప్‌డెస్క్‌లు
మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లు, వాటిలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. అభ్యర్థుల సందేహాలను హెల్స్ డెస్క్‌ల్లో నివృత్తి చేస్తున్నారు. అభ్యర్ధి వెంట మరో ఇద్దరి మాత్రమే నామినేషన్ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు.
మొదలైన నామినేషన్ల పర్వం
ఫ బీఆర్‌ఎస్ నుంచి నలుగురు దాఖలు
ఫ నేడు, రేపు భారీగా నామినేషన్లు
వస్తాయని అధికారుల అంచనా
ఫ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద పటిష్ట బందోబస్తు
సూర్యాపేటలో 13 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో బీఆర్‌ఎస్ 4, బీఎస్పీ2 ,కాంగ్రెస్ తరఫున 5, స్వతంత్రులు ఇద్దరు ఉన్నారు. తిరుమలగిరిలో 9, కోదాడలో 1, నేరేడుచర్లలో ఒకటి చొప్పున నామినేషన్ వచ్చింది. హుజూర్‌నగర్ మున్సిపాలిటీలో ఒక్క నామినేషన్ కూడా దాఖ లు కాలేదు. కాగా టిక్కెట్లు ఇంకా ఖరారు కాకపోవడంతో సాదాసీదాగా నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. గురు, శుక్రవారాల్లో భారీగా నామి నేషన్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.


