సమన్వయంతో విజయం సాధించండి
కోదాడ : మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటడానికి అభ్యర్థుల ఎంపికపై ఆయా రాజకీయ పార్టీలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. వార్డుల వారీగా సమీకరణలు చూసుకుంటున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి బుధవారం కోదాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశమయ్యారు. పార్టీ అన్ని విధాలా ఆలోచించి అభ్యర్థులను ఎంపిక చేస్తుందన్నారు. సమష్టిగా పని చేసి పార్టీ నిర్ణయించిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చందర్‌రావుతో పాటు చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్‌ను గెలిపించండి:
బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ పట్టణ అభివృద్ధి జరగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ కోరారు. బుధవారం తన నివాసంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. అదే విధంగా ఆశావాహులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలోనే అభ్యర్థులను పార్టీ ప్రకటిస్తుందన్నారు. విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధం: సీపీఐ
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లు సీపీఐ నాయకులు స్పష్టం చేశారు. బుధవారం కోదాడలోని సీపీఐ కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు జిల్లా నాయకులు తీర్మానం చేశారు. తమ పార్టీ ఆరు వార్డుల్లో పోటీ చేస్తుందని నాయకులు మేకల శ్రీనివాసరావు, బత్తినేని హనుమంతరావు, లతీఫ్ తెలిపారు.
ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఫ ఆశావహులతో భేటీ


