రాజేష్‌ది ముమ్మాటికీ పోలీసుల హత్యే
మునగాల: కోదాడకు చెందిన కర్ల రాజేష్‌ది ము మ్మాటికీ పోలీసులు చేసిన హత్యేనని ఎమ్మార్పీనెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగా అన్నారు. రాజేష్ లాకప్‌డెత్ కారకులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి మునగాల మండల కేంద్రంలోని ఎస్‌సీ కాలనీలో ఎమ్మార్పీఎస్ మండల శాఖ అధ్యక్షుడు గుడిపాటి కనకయ్య అధ్యక్షతన జరిగిన రాజేష్ సంతాప సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత రాజేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివా ళులర్పించారు. అనంతరం మంద కృష్ణ మాదిగా మాట్లాడుతూ రాజేష్‌ను పోలీసులు అకారణంగా నిర్భందించి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. ఈ ఘటనలో పోలీసులకు ఎమ్మెల్యే పద్మావతి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అండదండలు ఉన్నాయన్నారు. రాజేష్ మృతిచెంది 72 రోజులు గడిచిందని, తాను 62 రోజులుగా న్యాయ పోరాటం చేస్తున్నా పోలీసు అధికారులు నోరు మెదపకపోవడం అనుమానాలకు మరింత బలం చేకూరుతుందన్నారు. ఉత్తమ్ దంపతులు ఇకనైనా మౌనం వీడి వాస్తవాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాదిగల ఓట్లతో గెలుపొందిన ఉత్తమ్ దంపతులు రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలన్నారు. రాజేష్ మృతికి కారకులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకునే వరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్ర తినిధి బొర్ర భిక్షపతి మాదిగ, ఎంఎస్‌పీ జాతీయ, రాష్ట్ర నాయకులు వేల్పుల సూరన్న, కొండపల్లి ఆంజనేయులు మాదిగ, యలమర్తి రాము మాదిగ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ జిల్లా ఇన్‌చార్జి బచ్చలకూర వెంకటేశ్వర్లు, ఎంఎస్‌పీ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు, ఎమ్మార్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు దుబ్బ రామకృష్ణ, మాల మహా నాడు జిల్లా అధ్యక్షురాలు రాణి, మాదిగ మహిళా మండల ఇన్‌చార్జి వెంపటి ప్రమీల, ఎంఎస్‌పీ, ఎమ్మార్పీయస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు కొత్తపల్లి అంజయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ


